17, సెప్టెంబర్ 2021, శుక్రవారం

భగవద్గీత

 🌺🙏🌺శ్రీ శివాయగురవే నమః.🌺🙏🌺

🌺🙏🌺 శ్రీ పరమాత్మనే నమః. 🌺🙏🌺


         🌺🙏🌺భగవద్గీత.🌺🙏🌺

ఏడవ అధ్యాయము, జ్ఞానవిజ్ఞానయోగము నుంచి

9వ శ్లోకము, పదచ్ఛేద, టీకా, తాత్పర్యసహితముగా.

   🌺🙏ఓం నమో భగవతే వాసుదేవాయ.🙏🌺


🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺


పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ ౹

జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు ౹౹ (9)


పుణ్యః , గంధః , పృథివ్యామ్ , చ , తేజః , చ ,

 అస్మి , విభావసౌ ౹

జీవనమ్ , సర్వభూతేషు , తపః , చ , అస్మి ,

తపస్విషు ౹౹ (9)    


పృథివ్యామ్ = పృథ్వియందు ;

పుణ్యః , గంధః = పవిత్రమైన గంధతన్మాత్రను ;

చ = మఱియు ;

విభావసౌ = అగ్నియందు ;

తేజః = తేజస్సును ;

అస్మి = ఐ యున్నాను ;

చ = మఱియు ;

సర్వభూతేషు = సమస్తప్రాణులయందు ;

జీవనమ్ = జీవశక్తిని(చైతన్యమును) ;

చ = మఱియు ;

తపస్విషు =తాపసులయందు ;

తపః = తపస్సును ;

అస్మి = ఐ యున్నాను .      


తాత్పర్యము: పృథ్వియందు పవిత్రగంధతన్మాత్రను,

అగ్నియందు తేజస్సును ,సమస్తప్రాణులలో జీవశక్తిని

(చైతన్యమును) తాపసులలో తపస్సును నేనే . (9)


🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺

కృష్ణం వందేజగద్గురుమ్. శ్రీ కృష్ణం వందేజగద్గురుమ్.

    🌺🙏🌺సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు.🌺🙏🌺

    అందరికీ శుభ శుభోదయం . తదుపరి శ్లోకముతో

   మళ్ళీకలుసుకుంద్దాం. జై శ్రీ మన్నారాయణ.🙏🙏


🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️

🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼

                    Yours.....

Yennapusa Bhagya Lakshmi Reddy Advocate AP High Court Amaravathi and State President Legal Cell AP Reddy Sangam and Chairman AP Advocates Associations JAC Andhra Pradesh State

కామెంట్‌లు లేవు: