*జీవన సత్యం*
ఒక పిల్లవాడు తాగే నీరు అమ్ముతున్నాడు.
ఒక పెద్దాయన "అరేయ్ ఇటురా..." అని పిల్లవాడిని పిలిచాడు.
"ఒక ప్యాకెట్ ఎంత?" అని అడిగాడు.
"రూపాయి" అన్నాడు.
"యాభై పైసలకు ఇస్తావా?"
కుర్రాడు ఏమీ అనలేదు. చిన్నగా నవ్వాడు.
ముందుకు సాగిపోయాడు.
ఇదంతాచూశాడు ఒక సాధువు.
రైలు దిగి ఆ పిల్లాడి వద్దకు వెళ్లాడు.
"ఆ పెద్దాయన అన్నదానికి ఎందుకు నవ్వావు?"
"స్వామీ... అతనికి దాహం వేయలేదు. దాహం వేసిన వాడు ముందు ప్యాకెట్ తీసుకుని నీరు తాగుతాడు.
తరువాత ధర ఎంత అని అడుగుతాడు. అతనికి కేవలం టైమ్ పాస్ కావాలి." అన్నాడు.
"నిజమే... దేవుడిని కోరుకునేవాడు తర్కాలు, కుతర్కాలు చేయడు. ఆత్రంగా సాధన చేస్తాడు. ఆర్తితో పూజిస్తాడు తప్ప శతభిషలుండవు.
అవసరం ఉంటే బేరం ఉండదు. అవసరం లేకుంటే బేరం తప్ప మరేమీ ఉండదు." అనుకున్నాడు
సాధువు.....
🔹🔸🔹🔸🔹🔸🔹🔸🔹
*సత్య హీనా వృధా పూజా*
*సత్యహీనో వృధా జపః*
*సత్య హీనం తపో వ్యర్థం*
*ఊషరే వపనం యథా ||*
చవిటి నేలలో(నిస్సారమైన భూమి) విత్తనములు చల్లుట వ్యర్థ మైనట్టుగా సత్యహీన మైన పూజ, జపము, తపము యివన్నీ కూడా నిరుపయోగములే.
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి