23, జనవరి 2022, ఆదివారం

కాంచనమయ వేదికా

 *కాంచనమయ వేదికా కనత్కేతనోజ్జ్వల విభ్రమమువాఁడు*

_________________________________


(1) అర్జున - తెల్లనిది. అర్జునుడు అనగా తెల్లని శరీరచ్ఛాయకలవాడని అర్థం.


(2) కమ్మ అనగా చెవికమ్మ. ఇంకా ఒకప్రాంతంలో అనగా కమ్మనాడులో  నివసించిన జనులకు కలిగిన పేరు > జాతిబేధము. పత్రిక, మంచిరుచి (కమ్మనైన భోజనము), మట్ట (కొబ్బరిమట్ట), తాటియాకు, ప్రియమైనది, మంచివాసన (కమ్మనైన వాసన), అందము అనే అర్థాలువున్నాయి.


(3) కనిగిరి > కన్నియగిరి > కన్నియ అనగా చిన్నది, కొత్తది, పెండ్లికాని యువతి అనే అర్థాలున్నాయి.గిరి అంటే కొండ. చిన్నకొండ దగ్గర వెలసిన గ్రామం కాబట్టి ఆ గ్రామానికి కన్నియగిరి అనే పేరు కలిగింది.  కన్నియగిరి > కన్నిగిరి > కనిగిరి అయింది. ఇలా అ కార మ కారాల ఒత్తులను లోపింపచేసి పలుకడం వలన అచ్చమ్మపేట > అచ్చంపేటగాను, రాజమ్మపేట > రాజంపేటగాను, గంగమ్మపల్లి > గంగంపల్లిగాను, జానకమ్మపేట > జానకంపల్లిగాను మారాయి.


(4) చాండాలి > చాండాలిక > అనగా దుర్గాదేవి.చండాలురు > దుర్గాదేవి సంతతివారు > పూజ్యనీయులు.


(5) తార  అంటే ఓంకారమనే అర్థముతోపాటు కంటిలోని నల్లగుడ్డు, నక్షత్రమనే అర్థాలున్నాయి.

బృహస్పతి భార్యపేరు తార

వాలిభార్య పేరు తార


(6) బుద్ధఘోష అనగా పాళీ భాషలో బుద్ధుని పలుకులు.(Voice of Buddha) అని అర్థము. 5 వ శతాబ్ది (ACE)లో

బుద్ధఘోషుడు భారతదేశం / మగధదేశంలోని బుద్ధగయ వద్ద గల బ్రాహ్మణకుటుంబంలో జన్మించాడు.

శ్రీలంకకు వెళ్ళి అనురాధపురంలో స్థిరపడ్డాడు. బౌద్ధములోని తెరవాద శాఖకు చెందినవాడు.

తెరవాద సిద్ధాంతము ప్రకారం మనిషి శీలవంతుడు కావటానికి 7 మార్గాలను బోధించాడు. అవి (అ) శీలవిశుద్ధి అనగా ప్రవర్తనను పవిత్రంగా వుంచుకోవడం (ఆ) చిత్తవిశుద్ధి అనగా మనస్సును స్వచ్ఛంగా వుంచుకోవడం (ఇ)  విత్తివిశుద్ధి అనగా మనదృష్టిని సక్రమంగా వుంచుకోవడం (ఈ) కంక వితరణ విశుద్ధి అనగా సందేహాలను శంకలను అధిగమించడం > అనుమానం లేకుండా జీవించడం.(ఉ) మగ్గమగ్గ నాశనదస్సన అనగా మంచిదృష్టిని జ్ఞనాన్ని కలిగివుండడం. ఏది మంచో ఏది చెడో గ్రహించడం.(ఊ) శంకపురేక్క నాన అనగా కష్టమొచ్చినా సుఖం కలిగినా స్పందించకపోవడం., స్థితప్రజ్ఞత కలిగివుండటం (ఎ) నానాదశన విశుద్ది అనగా రకరకాల దర్శనాలపట్ల అవగాహన కలిగివుండడం. దర్శనాలు అనగా సిద్ధాంతాలు.


(7) నాస్తికుడు అనగా ఈ ప్రకృతి నిజం, కనబడుతున్న ప్రపంచం నిజమని, పరలోకంకాని పరలోక దేవుడు కాని లేనేలేవడనేవాడు.


(8) నీలిధ్వజుడు > నల్లటి తాటిచెట్టును ధ్వజముగా కలవాడు > భీష్ముడు.

ఉత్తరగోగ్రహణ సమయంలో బృహన్నల (అర్జునుడు) ఉత్తరకుమారునికి యుద్ధంలో తాను ఎదుర్కొబోయే కురుసైన్యం వారి జెండాలగురించి తెలిపాడు. ఈ అద్భుతపద్యభాగాలను తిక్కన అత్యంతద్భుతంగా మలిచాడు. మచ్చుకు...


*కాంచనమయ వేదికా కనత్కేతనోజ్జ్వల విభ్రమమువాఁడు* - *కలశజుండు*

*బంగారు రంగుతో చేసిన వేదిక మీద ప్రకాశిస్తున్న జెండా కల రథం మీద ఉన్నవాడు*

*కలశజుండు* *(కుండలో పుట్టిన వాడు ) : ద్రోణుడు*


*"సింహ లాంగూల భూషిత నభోభాగ కేతు ప్రేంఖణమువాఁడు ద్రోణసుతుడు "* -

*సింహపు తోకతో అలంకరించి ఉన్న రథంపై విరాజిల్లుతున్నవాడు ద్రోణసుతుడు అశ్వత్థామ.*


*"కనక గోవృష సాంద్రకాంతి పరిస్ఫుటధ్వజ సముల్లాసంబు వాఁడు కృపుఁడు "* -

*బంగారు ఆవు-ఎద్దుల జంట గుర్తుగా కలిగినవాడు కృపుడు.*


*"లలితకంబు ప్రభాకలిత పతాకావిహారంబువాఁడు రాధాత్మజుండు "* -

*"లలితంబుగా ప్రభావితమౌతున్న శంఖం పతాకముగా కలవాడు రాధ కుమారుడు కర్ణుడు.*


*"మణిమయోరగ రుచిజాల మహితమైన పడగవాఁడు కురుక్షితిపతి "* -

*"మణులతో పొదిగిన పడగ గల నాగు పాము పతాకముగా కలవాడు కురు క్షితి పతి.. దుర్యోధనుడు.*


*"మహోగ్ర శిఖర ఘన తాళతరువగు సిడమువాఁడు సురనదీసూనుడు"* -

*బ్రహ్మాండమైన తాళవృక్షం జెండాగా ఉన్నవాడు*

*సురనదీసూనుడు.. సురనదీ : గంగాసూనుడుకొడుకు* *భీష్మాచార్యుడు.*


*ఏర్పడఁజూచికొనుము : బాగా తేరిపార చూడు*


*కాంచనమయ వేదిక కేతనముగా కలవాడు ద్రోణాచార్యుడు. ఎగురుతున్న సింహం తోక కేతనముగా కలవాడు అశ్వథ్థామ. బంగారు గోవును కేతనముగా కలిగిన వాడు కృపాచార్యుడు. తెల్లని కేతనమ కల వాడు కర్ణుడు. పాము పడగను కలిగిన వాడు సుయోధనడు. తాటి చెట్టును కేతనముగా అలంకరించిన వాడు భీష్ముడు.*

॥సేకరణ॥

___________________________________________జి.బి.విశ్వనాథ.9441245857. అనంతపురం.

కామెంట్‌లు లేవు: