7, మార్చి 2022, సోమవారం

ప్రశ్న పత్రం సంఖ్య: 43

  ప్రశ్న పత్రం సంఖ్య: 43

కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

క్రింద ఇచ్చిన ప్రశ్నలకు 4 జవాబులు వున్నాయి ఒక జవాబు మాత్రం ఎంచుకోండి.

1) వజ్రం అన్నది దీని ఒక రూపమే

i ) ఇనుము 

 ii ) కార్బన్    

iii ) రాగి

 iv ) ఇత్తడి 

2) ఏకం ____ విప్రాణాం బహుదా వదన్తి

i ) చిత్ 

ii ) సత్  

iii ) మనః  

iv ) దేవః

3) భగవత్గీత ఎవరికి ఎవరు ఉపదేశించారు

i ) శ్రీ కృష్ణుడు అర్జనుడికి 

ii ) అర్జనుడు భీమునికి  

iii ) దృతరాష్ట్రుడు దుర్యోధనునికి 

 iv ) సంజయుడు విరాటునికి 

4)  సెమికండక్టర్ అనునది ఇందులో ఉపయోగిస్తారు

i ) సైకిల్

 ii ) ఫాన్ 

iii ) నీటి పంపు 

iv ) రేడియో, టెలివిషన్లలో 

5) రఘువంశం అనునది

i ) రామాయణానికి సంబందించినది 

ii ) భారతానికి సంబంధించింది 

iii ) వేదాలకు సంబంధించింది 

iv ) పురాణాలకు సంబంధించింది 

6)  భరణి అనునది దీనికి సంబందించినది

i ) పసుపు

 ii ) కుంకుమ

 iii ) బెల్లం 

iv ) ఇంగువ 

7) మనదేశంలో కారు నడిపే వారిని  ఇలా పిలుస్తారు

i) లాయరు   

ii ) క్లీనర్ 

iii ) ఓనర్ 

iv ) డ్రైవరు

8) మొట్టమొదటి తెలుగు కవి ఎవరు .

i ) నన్నయ 

ii ) పోతన 

iii ) వాల్మీకి 

iv ) వ్యాసుడు

9) భార్య భర్తల వైవాహిక సంబంధ వివాదాలను ఈ కోర్టు పరిష్కరిస్తుంది 

i ) సివిల్ కోర్టు ,  

 ii ) క్రిమినల్ కోర్టు .

iii ) కన్స్యూమర్ కోర్ట్ ,

iv ) ఫామిలీ కోర్టు 

10) వడ్లు ఈ రకము భూమిలో పండుతాయి

i ) మెట్ట భూమి 

ii ) మాగాణి భూమి 

iii ) బంజరు భూమి 

iv ) ఇసుకనేలా 

11) అన్ని మతాల వారు నమ్మేది

i ) దేముడు లేడని 

ii ) దేముడు ఉన్నాడని 

iii ) మనిషే దేముడని 

iv ) ఎవరి నమ్మకం వారిది

 12) ధమనులు అను రక్తనాళాలలో

i ) మంచి రక్తం ఉంటుంది 

ii ) చెడు రక్తం ఉంటుంది 

iii ) యెర్రని రక్తం ఉంటుంది   

iv ) రక్తం ఉండదు 

13) మనము తినే ఆహారంలో చెట్లనుంచి ఈ పదార్ధం రాదు

i ) బెల్లము  

ii ) పంచదార 

iii ) లవణము 

iv ) ఇంగువ

14) ఆది శంకరుల వారు బోధించినది  

i ) ఆత్మవేరు పరమాత్మ వేరని 

ii )ఆత్మ పరమాత్మ ఒకటేనని   

iii ) మనుషులంతా ఒకటేనని 

iv ) సన్యాసం ఒకటే దేముడిని చేరు మార్గమని 

15) జాతకంలో చంద్రుడు నీచంగా ఉంటే

i )బుద్ధిమంతులు అవుతారు 

ii )  నాయకులు అవుతారు

 iii ) మంచివాడు అవుతారు  

iv ) పిచ్చి వాళ్ళు అవుతారు

16) ఇది ఇంద్రియం కాదు

i ) కన్ను 

 ii ) ముక్కు     

iii ) చెవి  

iv ) గోరు

17) దీనిని తలస్నానం చేయటానికి వాడతారు  

i ) కుంకుడు కాయ 

ii ) తరిగిన దోసకాయ  

 iii ) తరిగిన ఉల్లిగడ్డ

 iv ) తరగని బెండకాయ 

18) కదళీ ఫలం అని దీనిని అంటారు

i ) అరటి ఫలం 

ii ) రేగి ఫలం 

 iii ) జామ ఫలం 

iv ) ద్రాక్ష ఫలం 

19) ప్రియం అను పదానికి గల రెండు అర్ధాలు

i ) ఇష్టమైనది మరియు కష్టమైనది 

ii ) ఇష్టమైనది మరియు ఖరీదైనది 

iii ) ఇష్టమైనది మరియు నష్టమైనది

 iv )   ఇష్టమైనది మరియు స్పష్టమైనది 

20)  ఈ పదము లాయర్లకు మరియు ఇంజనీర్లకు కూడా వర్తిస్తుంది 

i ) క్రిమినల్ 

ii ) సివిల్   

iii ) మెకానికల్  

iv ) ఎలెట్రికల్

 

కామెంట్‌లు లేవు: