7, మార్చి 2022, సోమవారం

కళామయ ప్రేమనొప్పె

 భీమవరం

-------------

శ్రీవెంపరాల ప్రభాకరసుబ్రహ్మణ్యంగారు(జీవితబీమాఉద్యోగులు)

------------------------------------------------

సత్కవివెంపరాల బుధసన్నుత పండితవంశ్యు  లెన్నియో

సత్కవితాంగణమ్ముల లసచ్చర శారద పుంస్వరూపులై

సత్కుతుకంబు శ్రోతలకు సౌఖ్య మొసంగగజాలు కైత ల

త్యుత్కట గాంగవేగమున తోరముగావచియించువారలే.


ఆప్రభాకర నాము షడాస్య వాక్య

హావభావసందర్శనాహ్లాదచతురు

మనుచరిత్ర"ధారణరణ"మనుభవమగు

భీమవరమె కళామయ ప్రేమనొప్పె.


కవివెంపరాల సత్కావ్య 'సరసచంద్రి

       కల' సాహితీవనిన్ వలపుహెచ్చె ,

బుధు వెంపరాల వాగ్భూషలన్ రామరాట్

        భూషణాఖ్యలకె సద్భోగమబ్బె ,

హితు వెంపరాల సాహిత్యవీచి నుగాది

         పేరోలగమ్ములన్  ప్రీతిపెరిగె ,

నుతి వెంపరాల బెత్తాతయె పెదదాత

          కీర్తిరాజ్యమునేలు స్ఫూర్తినొందె ,


పద్యకేతనమ్మెగురాడ పట్టుదలను

జీవితమ్మెబీమాచేయు సేవమెలగు

సుప్రభాకరమూర్తులు స్తుత్యమతులు

భైమవరులు సుబ్రహ్మణ్యుపలుకెపలుకు.


రాయప్రోలు సీతారామశర్మ ,భీమవరం.

కామెంట్‌లు లేవు: