🕉️🕉️ *సుభాషితమ్*🕉️🕉️
--------------------------------------
శ్లోకం:
*ఉద్యోగాదనివృత్తస్య*
*సుసాహాయస్య ధీమతః|*
*ఛాయేనానుగతా తస్య*
*నిత్యం శ్రీ స్సహచారిణీ||*
~సుభాషితరత్నావళి
తాత్పర్యం:
ప్రయత్నమునుండి విరమించని, మంచి బుద్ధిశాలియైనట్టి సహాయసంపంత్తులు కూర్చుకోగలిగినట్టి ఉత్తముడిని లక్ష్మి అనగా సంపద మరియు విజయము నిత్యమూ నీడవలే అనుసరించును.
🕉️ *సుభాషితమ్* 🕉️
*శ్లో𝕝𝕝 శాంతితుల్యం తపో నాస్తి*
*న సంతోషాత్పరం సుఖమ్|*
*న తృష్ణయా పరో వ్యాధిః*
*న చ ధర్మో దయాపరః||*
తా:
శాంతి కంటే మించిన తపస్సు లేదు.... తృప్తి, సంతోషాల కంటే మించిన సుఖము లేదు. పేరాశ ని మించిన రోగము లేదు. దయాగుణముని మించిన ధర్మము లేదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి