kgm Indraganti sankar 3:
*శ్రీ విష్ణు సహస్ర నామ విశ్లేషణ.* >>>>>>>>>>>>>ॐ<<<<<<<<<<<<<<<<<< *5. భూత కృత్.* ఇది మూడు అక్షరముల నామము ఈ నామమును మనముచెప్పుకొని భక్తితో స్కరిచేటప్పుడు. *ఓం భూతకృతే నమః.* అని పలుక వలెను.
*భూతకృత్ = సకల భూతముల ను సృజించువాడు. భూతని - కృన్తతి = సకల భూత ములనునాశనముచేయువాడు.*
*“భూతాని కరోతి - ఇతిభూతకృ త్” “సర్వాణి భూతానిస్వతంత్రః సృజతి"* స్వతంత్రముగా, అనగా ఏ విధమైన ఆధారము లేకుండా,సర్వభూతము లను సృజించు పరమాత్ముడే! అని *‘భూతకృత్'* అని శ్రీ భట్టులు వా రు వ్యాఖ్యానించారు.
రజోగుణముననుసరించి చతుర్ము ఖ బ్రహ్మ రూపమున సకల ప్రాణుల ను సృజించు ఆపరమాత్ముడేతమో గుణమునాశ్రయించి,రుద్రునిరూపం లోసకలప్రాణులనుసంహరించును. (భూతాని - ప్రాణులను, కృష్ణతి - నాశనము చేయును) కనుక కూడ ఆయన *'భూతకృత్'* అని ఈ నా మమునకు అర్ధము చెప్పవచ్చును.
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
*ఓంనమోభగవతేవాసుదేవాయ. ఓం శ్రీ విష్ణురూపాయ నమశ్శివా యనమః. ఓంనమోనారాయణాయవిశ్వస్మైనమః. (మానవసేవయేమాధవసేవ.) . సర్వేషాంశాన్తిర్భవతు.* . *ఇంద్రగంటి శంకర ప్రసాద శర్మ. సింగరేణి సూపర్ బజారు వెనుక. కొత్తగూడెం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. తెలంగాణారాష్ఠ్రం.*
*శ్రీ విష్ణు సహస్ర నామ విశ్లేషణ.* >>>>>>>>>>>>>ॐ<<<<<<<<<<<<<<<<<< *6. భూతభృత్.* ఇది నాలుగు అక్షరములనామము ఈ నామమును మనముచెప్పుకొని భక్తితో స్కరిచేటప్పుడు. *ఓం భూతభృతే నమః.* అని పలుక వలెను.
*భూతభృత్ = అన్నిభూతముల ను పోషించువాడు.*
చక్రమునకు ఇరుసువలెనుండి,వాని కాధారమై,అంతరాత్మయైమార్గదర్శి గా భగవంతుడు అన్ని భూతముల ను పోషించును.
ఆదికూర్మముగా మందరగిరినిధరిం చినవాడు,శ్రీ వరాహమూర్తియై భూ మిని ఉద్ధరించినవాడు అయినశ్రీమ హావిష్ణువే *'భూతభృత్'* అనిశ్రీరా ధాకృష్ణశాస్త్రిగారు వివరించినారు.
పైమూడు నామములు ( *భూతభ వ్య భవత్ప్రభుః;భూతకృత్,భూ తభృత్*)కలిపి - భగవంతుడు సృష్టి, స్థితి,లయములకు,ఆధారమ ని తెలియుచున్నది. కాని ఆయనకుఆది,అంతములేదు. సృష్టికిని,కాలమునకును,భూతము లకును ఆధారము ఆయనే!.
*శింశుమారాత్మనా విష్ణుః భూతా దీ నుర్ధ్యతః స్థితాన్! దధీశిష తయా లోకాన్ సప్తలోకా న్ అథః స్థితాన్.!!*
శ్రీమహావిష్ణువుశింశుమార(మొసలి) రూపంలో ఊర్ధ్వలోకములను, ఆది శేషునిరూపంలోఅధోలోకాలనుధరిం చియున్నాడు. లోకాలయొక్క రక్షణ బాధ్యత శ్రీ మ హావిష్ణువుదే!. అందుచేతనే,సత్వగుణము,నాశ్రయించిజీవులన్నిటినీపాలిస్తున్నాడు,పోషిస్తున్నాడు. కనుక ఆయన *'భూతభృత్'.* భూతభృత్ అన్ని భూతములనుపో షించువాడు *"భూతాని బిభ్రతి ఇ తి భూతభృత్"* అని అర్థము గా చెప్పుకోనవచ్చును .
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
*ఓంనమోభగవతేవాసుదేవాయ. ఓం శ్రీ విష్ణురూపాయ నమశ్శివా యనమః. ఓంనమోనారాయణాయవిశ్వస్మైనమః. (మానవసేవయేమాధవసేవ.) . సర్వేషాంశాన్తిర్భవతు.* . *ఇంద్రగంటి శంకర ప్రసాద శర్మ. సింగరేణి సూపర్ బజారు వెనుక. కొత్తగూడెం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. తెలంగాణారాష్ఠ్రం.*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి