మనకు ఏం కావాలో మనకే తెలియదు.
*ఒక చిన్న కథ*ద్వారా తెలుసుకుందాం.
ఒక రోజు భక్తుడు: నేను ఇంటికెళ్లే రోడ్డు మీద బంగారం దొరికేలా ఆశీర్వదించండి స్వామి!! అని అడిగాడు.
స్వామిజీ: ఎవరిని కొరుకుంటున్నావురా అబ్బాయ్ దేవుడి నేనా?
భక్తుడు: అవును బాబాయ్ , దొరికితే చాలా బాగుండు!
స్వామిజీ: దొరికితే ఎం చేస్తావ్?
భక్తుడు: అమ్మితే డబ్బులు వస్తాయ్, హాయిగ ఖర్చు పెట్టుకోవచ్చు.
స్వామిజీ: ఎలాగు దేవుడినే కదా కొరుకునేది..అదేదొ డబ్బులే దొరకాలి అని కొరుకోవచ్చు కద..
భక్తుడు: అవును ..నువ్వు చెప్పిందే కరెక్ట్, ఇప్పుడు బంగారం దొరికి దాన్ని అమ్మడం..! ఇదంత టైం వేస్ట్... నాకు డబ్బు దొరకాలి.
స్వామిజీ: ఎంత?
భక్తుడు: ఒక 100 కొట్లు.
స్వామిజీ: ఎలాగు దేవుడినే కదా కొరుకునేది..అదేదొ లక్ష కోట్లు కొరుకోవచ్చు కదా..
భక్తుడు: అవును లే, ..ఎలాగు దేవుడినే కదా.. సరే లక్ష కొట్లు కోరుకుంటా..
స్వామిజీ: ఎం చెస్తావేంటి, లక్ష కోట్లతొ?
భక్తుడు: బిల్డింగులు, కార్లు కొంటాను!
స్వామిజీ: పిచ్చోడ! దేవుడిని, అవే కోరుకోవచ్చు కద! సరే అవన్ని కొంటే???
భక్తుడు: ఇంకేముంది సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండొచ్చు
స్వామిజీ: పిచ్చివాడా, అదేదొ దేవుడిని సంతోషం కావాలని కోరుకోవచ్చు కదా..??
భక్తుడు :నిజమే స్వామి 🙂😐😶😑
మిత్రులారా! మనకు ఏం కావాలో, మనకు తెలియదు...
మనకు ఏమి అర్హత కలదో, ఈశ్వరునికి తెలుసు
అందుకే ఈశ్వరునికి సంతోషము కలిగించే పనులు చేస్తే, ఈశ్వరుడు మన అర్హతను బట్టి, మనకు కావలసినవి, దానితో పాటు మనకు సంతోషం,సంతృప్తి ఇస్తాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి