26, అక్టోబర్ 2022, బుధవారం

నడుము నొప్పి నివారణ

 అతి భయంకరమైన , మొండి నడుము నొప్పి నివారణకు నేను ప్రయోగించిన ప్రాచీన యోగం - 


    ఎండు ఖర్జురాలు తీసుకుని ఒక వైపు నుంచి రంధ్రం చేసి లొపలి విత్తనము తీసివేసి లొపల ఖాళి ప్రదేశంలో తెల్ల గుగ్గిలం పొడి నింపి గోధుమ పిండి తడిపి ముద్దలా చేసి ఆ రంధ్రం మూసివేసి అదేవిధంగా  కాయ పైన కొంచం మందంగా తడి గొధుమ పిండితో పట్టులా వేసి కర్రబొగ్గుల నిప్పుల పైన వేసి కాల్చి బయటకి తీసి చల్లారిన తరువాత పైన మాడినటువంటి గొధుమ పిండిని తీసివేసి బాగా ఉడికిన ఖర్జురాల్ని బాగా నూరి శనగగింజలు అంత మాత్రలు చేసి రెండు పూటలా ఆహారానికి ముందు నీటితో ఇచ్చాను . 


      అలాగే నువ్వుల నూనె ఒక స్పూన్ తీసుకుని దానిలో ఒక స్పూన్ నిమ్మరసం కలిపి బాగా వ్రేలితో కలిపినప్పుడు తెల్లటి ద్రవం లా మారిన తరువాత ఆ ద్రవంతో పై నుంచి కిందికి ఒక పది నిమిషాలు మర్దన చేయించాను . 


       కేవలం 40 రోజుల్లొ మార్పు వచ్చింది.


 గమనిక  - 


      కొంతమంది తెల్ల గుగ్గిలం బదులు గవ్వపలుకు సాంబ్రాణి అని చెప్తున్నారు . దానిని ఈ యోగంలో ఉపయోగించటం వలన నొప్పి నివారణ కాదు. 


        మరింత విలువైన సమాచారం కొరకు నా గ్రంథములు చదవగలరు . 


   

కామెంట్‌లు లేవు: