3, డిసెంబర్ 2022, శనివారం

భగవత్గీత ఆరవ అధ్యాయము

 *అందరికి హరి ఓం ప్రణామములు!* 

భగవత్గీత ఆరవ అధ్యాయములో అర్జునుడు, శ్రీకృష్ణునితో కృష్టా!


మానవుని మనస్సు చాలా చంచలమైనది. బాధాకరమైనది, అల్లకల్లోలమైనది, బలమైనది మరియు మూర్ఖపు పట్టుగలది. దీనిని నిగ్రహించటం చాలా కష్టం. 


అనేకమైన విషయవాసనలకు లోనై, సంసారబంధాల వెంట పరుగులు పెడుతూ ఉంటుంది. దానివల్ల రాగద్వేషాలు, సుఖదుఃఖాలు, బంధనాలు కలుగుతూ ఉంటాయి. ఇవ్వన్నీ సంసారం పట్ల వ్యామోహానికి కారణమై, మనస్సు వ్యాకులపడుతూ ఉంటుంది. దురదృష్టవశాత్తూ నేటి ఉరుకుల పరుగుల జీవితంలో కొందరు తాత్కాలిక సుఖాలే శాశ్వతమని భ్రమసి, వాటి కోసమే చేయరానివి చేస్తూ, చేయవలసినవి మానివేస్తూ, తమకే కాకుండా తమ చుట్టూ ఉన్నవారికి, సమాజానికి కూడా నష్టాన్ని తెస్తున్నారు. చాలామందికి నైతికంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరాలని ఉన్నా ఏం చేయాలో తెలియక అయోమయ స్థితిలో ఉంటారు. అందువల్ల ప్రతీ ఒక్కరూ మనశ్శాంతికి, స్థిరత్వానికి ఆరాటపడుతూనే ఉంటారు. ఎలా సాధించాలో తెలియక మరింత కలవరపడుతూ ఉంటారు. మానవునికి కావలిసినది భోగం కాదు యోగం అని చెప్తూ మన సనాతనధర్మం ఇలాంటి వారికి ఒక చక్కని మార్గనిర్దేశం చేసింది. మనం అదుపులో ఉంచవలసినవి, నియంత్రించవలసినవి నియంత్రిస్తూ, ప్రయత్నపూర్వకంగా ఆచరించవలసినవి ఆచరిస్తూ ఉంటే, మనఃశ్శాంతితో పాటు ఆధ్యాత్మికోన్నతి కూడా కలుగుతుంది. ఎందఱో దార్శనికులు, మహర్షులు దీనికోసమై అనేక మార్గాలను మనకు సూచించారు.


అందులో *పతంజలి మహర్షిచే చెప్పబడిన యోగశాస్త్రం ద్వారా యోగా నేర్చు కోవడం చాలా మంచిది.*  సులువైనది, ఆరోగ్యానికి ఉత్తమమైనది. 


కాబట్టి చిన్మయ మిషన్ లో *21వ తేదీ నుండి ఉదయం 5 గ.. నుండి 6 గ. వరకు* యోగా మరియు ధ్యానం క్లాసులు ప్రారంభిస్తున్నాము. సంప్రదించగలరు.


స్వామి పరాత్మానంద సరస్వతి.

చిన్మయ మిషన్ - శ్రీకాకుళం వివరములకు: -" చిన్మయ మిషన్", కో ఆర్డినేటర్,  కే.వెంకటేశ్వర్లు :-  Contact cell no :9440546282.         


*ఆత్మస్వరూపులైన భగవత్ భక్తాదులందరికి హరి ఓం ప్రణామములు.* 


         మన శ్రీకాకుళంలో మీ అందరి యొక్క సహకారంతో ప్రారంభించిన చిన్మయ మిషన్ ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక నుంచి ప్రతి నెల ఇంటింటా  భగవద్గీత       పారాయణ లో భాగంగా 20వ తేదిన గాని, ఏకాదశి రోజున గాని, పౌర్ణమి రోజున గాని నెలకు ఒకరి ఇంట్లో  భగవద్గీత     పారాయణం చేయుటకు నిర్ణయం తీసుకోవడం జరిగినది. 


          *సంపూర్ణ    భగవద్గీత

 పారాయణం, కృష్ణ అష్టోత్తర పూజ ఉంటుంది.* 

*మీ స్వామి పరాత్మానంద సరస్వతి* 

*చిన్మయ మిషన్, శ్రీకాకుళం* 


*వివరములకు: -" చిన్మయ మిషన్", కో ఆర్డినేటర్,  కే.వెంకటేశ్వర్లు :-  Contact cell no :9440546282.         


131)పిల్లలు కు ఉరు తున్న విద్య కావలి, (బావి లో నీరు తోడుతున్న నీరు  ఊరుతుంది )అలాంటి విద్య  కావలి. భగవద్గీత శ్లోకాలు, Morls (విలువ లు )కావాలి అప్పుడు సంస్కారం ఏర్పడి తుంది. కాని"" మనం కేవలం  డబ్బు తో  కొనుక్కునే విద్య నేర్పిస్తున్నాము "". భవిష్యత్ లో ప్రమాదం జరుగుతుంది. (కేవలం ""లాభం, నష్టం తో కూడు కొన్న విద్య నెరుపు తున్నాం )అది దాని వల్ల పెద్ద అయినా తరువాత "తల్లి తండ్రి ని చూడాలి అంటే లాభం నష్టం లు చూస్తారు ". తరువాత దేవుడు,ని మతం ని మార్చుతారు ". అది మనకు  అవసరం మా?(ప్రతి మనిషి పుట్టినది భగవద్గీత రహస్యం ములు తెలుసుకోవాడానికే అని మీకు తెలుసా? ఇది గమనించగలరు )అందుకే శరీరం సంపాదన  మాత్రమే కాకూడదు.

కామెంట్‌లు లేవు: