6, మార్చి 2023, సోమవారం

కాశీ యాత్ర...

 పరమాచార్య వారి కాశీ యాత్ర...

భారత దేశం లో జన్మించిన ప్రతి ఒక్కరూ చేయవలసిన యాత్ర కాశీ యాత్ర అని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. మూడు పవిత్ర కార్యాలు చేసిన వారికీ యమ దర్శనం కాదంటారు.1. గంగలో స్నానం.2. భగవద్గీత లో ఒక్క శ్లోకమైన పారాయణ చేయడం 3.ఒకసారైనా శ్రీమన్నారాయణుని పూజించడం (భజ గోవిందం )

ఇక యాత్రా విశేషాలకొస్తే...

పరమాచార్య వారు క్రమ పద్దతిలో సంకల్పం, యాత్ర, దానం, లాంటివి పూర్తి చేసి ముందుగా రామనాధ పురం (రామేశ్వరం )వెళ్లారు.దారిలో వినాయకుని పూజించి నవ పాషాణం తో నవగ్రహా ప్రీతి కోసం పూజ చేసారు. రామేశ్వరం లోని అన్నీ బావులలో స్నానం ఆచరించి రామనాధ స్వామి ని సేవించుకొని అక్కడ మట్టిని సేకరించారు.అక్కడ నుంచి  అలహాబాద్ చేరుకొని త్రివేణి సంగమం లో స్నానం చేసి తాము తెచ్చిన మట్టిని కరిగించి అక్కడి నుండి పవిత్ర గంగా జలాన్ని తీసికొని కాశీ చేరుకున్నారు.అక్కడ విశాలాక్షి సమేత విశ్వనాధుణ్ణి, బిందు మాధవుడు, కాలభైరవుడు వంటి వారిని దర్శించుకొని గయకు చేరుకున్నారు. అక్కడ అక్షయ వటం, విష్ణు పాదం, చూసుకొని, మరల రామేశ్వరం వెళ్లారు. కాశీ తీర్ధం తో రామేశ్వరుని అభిషేకించి కంచి మఠం చేరుకొని సమారాధన చేసారు.

ఈ యాత్ర పూర్తి కావడానికి స్వామి వారికీ 21సంవత్సరాలు పట్టిందని చెబుతారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాల గుండా ప్రయాణించారు. ఈ రాష్ట్రాలలో వారు దర్శించని దేవాలయాలు, స్నానమాచరించని నదులు లేవు. ఈ పాదయాత్ర ను కాశీ యాత్రనంతరం కూడా కొనసాగించారు.

*** గీతలో భగవంతుడు చెప్పినట్లు "యద్య దాచరతి శ్రేష్ఠః "... స్వామి వారికీ ఎలాంటి యాత్రలు అవసరం లేనప్పటికి మనవంటి వారలకొరకు వారు ఆచరించి చూపుతారు.

కామెంట్‌లు లేవు: