10, మార్చి 2023, శుక్రవారం

ఐశ్వర్యం

 .


               _*సుభాషితమ్*_


శ్లో𝕝𝕝 

*అభిభూతోఽప్యవజ్ఞాతో*

*యో రాజ్ఞాం ద్వారి తిష్ఠతి।*

*న తు రాజ్ఞాం శ్రియం భుఙ్క్తే*

*నాభిమానీ కదాచన॥*


తా𝕝𝕝 *తిరస్కరించబడినా, అవమానించబడినా రాజుల ద్వారం విడవకుండా ఉండేవాళ్లు ఐశ్వర్యం అనుభవించ గలుగుతారు*..... కానీ? *ఆత్మాభిమానం కలవారు ఎన్నడూ అనుభవించలేరు*......


               _*సుభాషితమ్*_


 𝕝𝕝శ్లో𝕝𝕝 

*నాస్తి జాత్యా రిపుర్నామ*

*మిత్రం వాపి న విద్యతే*|

*సామర్థ్య యోగాజ్జాయన్తే*

*మిత్రాణి రిపవ స్తథా||*


తా𝕝𝕝

*పుట్టుకతో ఎవ్వడూ శత్రువు కాదు*... 

*ఎవ్వడూ మిత్రుడూ కాదు*.... 

*సామర్థ్య వినియోగాన్ని బట్టియే మిత్రులయినా శత్రువులైనా ఏర్పడుదురు*

"....శ్లోకం:☝️

*రక్షితవ్యా హి సంబంధా*

 *యాథార్థేణ న యే స్థితాః |*

*యాథార్థేణ చ సంబంధా*

 *ధేనుర్వత్సకయోరివ ||*


భావం: తుమ్మితే ఊడిపోయే సంబంధాలు, అనుక్షణం రక్షించుకోవలసిన సంబంధాలు ఎప్పటికీ నిజం కావు. అటువంటి అవసరం లేని ఆవు-దూడ వంటి సంబంధాలు మాత్రమే నిజమైనవి, నిలకడైనవి.

కామెంట్‌లు లేవు: