16, మార్చి 2023, గురువారం

ముందు నిర్ణయం!*

 🙏 నమస్కారం అండి 🙏


🙏 *ఓం నారాయణ- ఆదినారాయణ* 🙏


*గ్రంథం:* అమృత వాక్కులు, భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారి దివ్య బోధలు

*రచన:* శ్రీ పెసల సుబ్బరామయ్య మాష్టర్ 


*అంతా ముందు నిర్ణయం!*


ఏఏ జీవి ఏమి తినాలో? ఏమి అనుభవించాలో? ముందే నిర్ణయించబడి భూమి మీద పుడుతారు. అంతకుమించి ఏమీ అనుభవించలేడు. ఆశతో సంపాదించినా ఇనుప పెట్టెలలోను, బ్యాంకులలోను స్థిరాస్తుల రూపాలలో ఉంటే వాటికి కాపలాగా ఉండవలసిందే. తన సంపాదన ఇతరజీవుల రూపంలోని భగవంతునకై వెచ్చిస్తే భగవంతుడు గొప్పగా తృప్తి చెంది ఆశీర్వదిస్తాడని తమ ఆచరణతో శ్రీ స్వామి వారు చూచి నేర్చుకొని తరించమన్నారు. అంతటి విశ్వాసము, ఆచరణ ఉంటే సద్గురువే మనలను వెతుక్కుంటూ వస్తారని బోధిస్తున్నారు. 


*తన గురువుకు ప్రతిరూపమైన అగ్నిని ఒక్క క్షణం ఏమారకుండా సేవించారు. ఈ విశ్వమంతా తన గురురూపమే గనుక అన్ని జీవులూ తన గురురూపంగా భావించి సేవించారు.* సేవిస్తున్నారు. జీవుల గతచరిత్రనే చూడకుండా తన్నాశ్రయించిన ప్రతివారినీ ఆదుకుంటున్నారు. తనయందు విశ్వాసం గల్గి తన మార్గాన జీవిస్తారని చూస్తున్నారు. బొత్తిగా మనలో మార్పేలేకుండా వ్యాపార సరళిలో ప్రవర్తిస్తూ ఇది చేస్తే అది ఇస్తాననే మన నడవడిలో మార్పులేకుంటే *పొయ్యేవాళ్ళను పోనిచ్చేదే గదయ్యా!* అన్నారు. ఇది నేటికీ అక్షరాల నిజమై ఉంది.


🙏 *ఓం నారాయణ -ఆది నారాయణ*🙏


🌹🌹🌹🌹🌹🌹🌹🌹


*శ్రీసాయినాథ ప్రబోధామృతము పారాయణ.*


రచన:- శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు


             *నూత్న యుగానికి వినూత్న బోధ*


“శ్రీ సాయిసచ్చరిత్ర”లో సాయి చెప్పినట్లు ఆయనబోధ అత్యద్భుతము అద్వితీయము (అధ్యాయం 18). ఆయన స్థితినిగానీ, బోధనుగాని అర్ధం చేసుకోవడఁ చాలాకష్టం. కారణం తాము సద్గురువునని ఆయన ఎన్నడూ చెప్పుకోలేదు. తమను భక్తులెలా భావించవలసినది. సేవించవలసినదీ చెప్పని అత్యంత నిరాడంబరుడు కాని అది తెలియక వారి భక్తులు ఉత్తమ ప్రయోజనం పొందలేకపోవడం గూడ ఆయనకు సమ్మతంగాదు. అందుకే ఆ విషయాలు వారికీ తెలియగలందుకే 'శ్రీగురుచరిత్ర' పారాయణ విధించారు. అయితే ప్రతివారికీ అలా చెప్పలేదు గదా, అంటే అందరూ ముముక్షువులుండరు, ఆ మాట వారే చెప్పారు మామిడిపూత ఉదాహరణతోనూ తనను లౌకిక ప్రయోజనాలాశించి ఆశ్రయిస్తారని చెప్పినపుడూ, మరికొందరికి భిన్నమైన అభిప్రాయాలు దృఢంగానాటుకొని యుండడం వలన సాయి చెప్పినా వారికి శ్రద్ధకల్గదు ఈనాడు మనలోగూడ చాలామందికిది తెలిసినా కలగనట్లే.



కామెంట్‌లు లేవు: