బహు జన్మల పుణ్య ఫలం, మానవ జన్మ ! సృష్టి కర్త యొసగిన అత్యంత విలువైన జన్మ ! చరాచర జీవజాతి నిత్య ప్రశాంత జీవన గమనంలో తేజో ప్రకాశమై వెలుగొందెడి సుచైతన్య దివ్య దీపిక ! ప్రకృతి అనునిత్యం నేర్పెడి సన్మైత్రీ జీవన దృక్పథ మహోన్నత దార్శనికత ! యుగాలాది నిత్య జీవన చక్రభ్రమణంలో, విశ్వ జీవ సుసంక్షేమాత్మక నిత్య జీవనంలో, విశ్వ మానవాళి ప్రధాన పాత్ర పోషిస్తున్న తీరు, అనాదిగా ప్రత్యేకత సంతరించుకోవడం గమనార్హం ! విశ్వ సురక్షా భావనాత్మకతయే ప్రధానాంశమై, సకల విశ్వ జీవ సుసంక్షేమ జీవన మార్గమై, జరిగే కాలానికి, ప్రతి సెకనూ మహత్తరమై ప్రకాశించే సన్నివేశం ! " తాము సుసంక్షేమాత్మక జీవన బాటలో నడుస్తూ, సకల విశ్వ జీవరాశి కూడా స్వేచ్ఛగా ప్రశాంతంగా నిత్య జీవనం సాగించాలన్నదే ప్రధానాంశంగా, తమకు సృష్టి కర్త యొసగిన బ్రతుకుకు సరియైన రీతిలో సాకారాన్ని పొందాలనే మహోన్నత భావనగా, పరమోన్నత దివ్య సందేశాన్నొసగే ప్రకృతి, ప్రాతఃకాలంలో సకల జీవ జీవకారుణ్యతాత్మక నిత్య జీవన బాటను అందరికీ చేరువ చేస్తున్న నేపథ్యం ! సత్వర వసుధైక కుటుంబక నిర్మాణాత్మక బాధ్యతను, ప్రధానాంశంగా తీసుకోవలసిన విశ్వ మానవాళికి, రమణీయమైన, సుమధురమైన ప్రకృతి ఎల్లవేళలా సముచిత, సమోన్నత నిత్య సుచైతన్య దివ్య స్ఫూర్తి ! ✍️గుళ్లపల్లి ఆంజనేయులు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి