మహిళ - మాతృమూర్తి
నవమాసములు మోసి భవము నిచ్చెడి నాతి
శిశువుకు ధరపైన సృష్టికర్త
అమృతము నందించి యక్కున నిడుకొని
లాలించి పాలించు రమ్యచరిత
యులకని శిశువుకు పలుకులు నేర్పించి
మోదమున్ గూర్చెడి మొదటి గురువు
సతతమ్ము శిశువుకై వెతలను తా నోర్చి
బుజ్జి బొజ్జకు పాలు పోయు నెలత
యడుగు లేయు చుండ హస్తమ్ము నందించి
పడక పట్టు కొనెడి ప్రాపు కాంత
అతివ పతికితోడు సతతమ్ము బ్రతుకున
అవని యన్నిటందు యతివ మిన్న
గోపాలుని మధుసూదన రావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి