14, జులై 2023, శుక్రవారం

_చాగంటి గుడిగంట_

 *_చాగంటి గుడిగంట_*

_______________________


_ప్రవచనకర్త పుట్టినరోజు_


************************

_*చాగంటిపై కవితా..*_

_ప్రవచనానికి నిర్వచనమైన_

_శారదా పుత్రునిపై_ 

_వచన కవనమా.._

_వచనానికే బహువచనమైన_

_ప్రవచనచక్రవర్తిపై_

_నాలుగు మాటలు రాయాలని ఆర్తి.._

_మాటకే స్ఫూర్తి..._

_ఎల్లలేని కీర్తి.._

_ఎనలేని సమయస్ఫూర్తి_

_ఆ పరిపూర్ణ మానవతామూర్తి.._

_ఎంత రాస్తే..ఏమని వర్ణిస్తే_

_తృప్తి..నా దీప్తి.._

_చంద్రునికో నూలుపోగు.._

_పుంభావ సరస్వతికి_

_అక్షరాల హారతి.._

_ఈ రీతి..నా నిరతి!_


*_చాగంటి గళం_* 

_పోతన పద్యాల గంగాళమా.._

_ఆ రసన_ 

_వాల్మీకి  తన రామాయణాన్ని_ 

_లిఖించిన తాళపత్రమా.._

_శ్లోకం ఆయన నోట_

_పంచదార పాకం.._

_పద్యం దేవదేవునికే నైవేద్యం!_


*_చాగంటి మాటలు_* 

_చద్ది మూటలు.._

_ధారణ అసాధారణమై.._

_అజ్ఞానాంధకారంలో_ 

_నిను నడిపించే_ _వెలుగుకిరణమై.._

_ఆధ్యాత్మిక తోరణమై.._

_ముక్తి వైపు నీ చేయి పట్టి_

_నడిపే ఆపన్నహస్తమై.._

_నీ విజ్ఞాన సమస్తమై..!_


*_ఇలాంటి ఓ మనిషిని_*

_ప్రజ్ఞాన సర్వస్వమనాలో.._

_ఆధ్యాత్మిక భాండాగారమని_

_పిలవాలో.._

_పురుషరూపం దాల్చిన_

_వాగ్దేవి అని కొలవాలో.._

_కారణజన్ముడని స్తుతించాలో.._

_దేవుడే అని ప్రస్తుతించాలో..!_


*_ప్రవచనం ఆయనకు దైనందినం.._*

_ఎన్నిసార్లు చేసినా ఆనందమే_

_దినం దినం.._

_ఆయన అసీనమైన వేదిక_

_భక్తి సుమాల నందనం.._

_ఆ సన్నిధానమే_

_సకల క్షేత్ర సందర్శనం.._

_అక్కడ దేవతలే సంచరిస్తున్న_ 

_అనుభూతి దైవత్వ ఉనికికే_

_ప్రత్యక్ష నిదర్శనం..!_


_*చాగంటి ప్రవచన శ్రవణం*_

_దివ్యలోక విహారం.._

_పక్కనే వాగ్దేవి ఉన్నట్టు.._

_అచ్చోట శ్రీరాముడే సీతాసమేతుడై_

_కొలువుదీరినట్టు.._

_సభాస్థలిని అంజనాపుత్రుడే_

_పర్యవేక్షిస్తున్నట్టు.._

_ముక్కంటి ఆ వాగ్ధాటిని_

_గని..విని.._

_శిరసుపై ఉన్న గంగతో_

_నీ వేగాన్ని మించిన_ 

_ఆ వాక్ప్రవాహాన్ని చూసావా.._

_అని మేలమాడినట్టు.._

_వేణుగోపాలుడు_

_ఇతడు సాందీపుడా అని_

_దీపం వెలుగులో మరింత_ _నిశితంగా చూసినట్టు.._

_వ్యాసుడు తనను తానే_ 

_చూసుకుంటున్నట్టు.._

_ముక్కోటి దేవతలే_ 

_మారువేషాల్లో బెరుకుగా_

_ఇరుకున వరసల్లో_

_కూర్చున్నట్టు.._

_సభ దేవసభే అన్నట్టు.._

_కలియుగమే_ _భక్తిరసరమ్యయోగమైనట్టు..!_


*_చాగంటి పలుకు.._*

_వేదానికి అనువాదం.._

_ఆధ్యాత్మిక నినాదం.._

_కలియుగంలో భక్తినాదం.._

_వాగ్దేవికి ముదం.._

_సకల దేవతలకు ఆమోదం..!_


*_ధర్మ స్థాపనకు  దేవుని అవతారం.._*

*_ధర్మరక్షణకు రుషి.._*

*_ధర్మబోధనకు గురువు.._*

*_ధర్మవ్యాప్తికి ప్రయోక్త.._*

*_ఈ అందరి సమ్మేళనమే_*

*_చాగంటి అనే వక్త.._*

*_పంచె..లాల్చీ కట్టి.._*

*_నుదుటిన విభూతి పెట్టి..._*

*_ధోవతి ధరించి.._*

*_వేదికను అలంకరించే.._*

_*ధర్మ ప్రచార ప్రవక్త..!*_


*కృష్ణం వందే జగద్గురుం..*

*చాగంటి యందే* 

*మన సద్గురం..*

*కోటేశ్వరా..కోటి దండాలు..!*


🙏🙏🙏🙏🙏🙏🙏


*_ఎలిశెట్టి సురేష్ కుమార్_*

       9948546286

కామెంట్‌లు లేవు: