22, నవంబర్ 2023, బుధవారం

సౌందర్యలహరి🌹* . *శ్లోకం - 83*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*

.                   *శ్లోకం - 83*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷

    

   *పరాజేతుం రుద్రం ద్విగుణశరగర్భౌ గిరిసుతే*

 *నిషంగే జంఘే తే విషమవిశిఖో బాఢ మకృత |యదగ్రే దృశ్యంతే దశ శరఫలాః పాదయుగళీ*  *నఖాగ్రచ్ఛద్మానస్సురమకుటశాణైకనిశితాః ‖*


ఇక అమ్మవారి వర్ణన పాదములు,నఖముల వద్దకు వెళ్తున్నది. అయితే ముందుగా ఆమె కాలి పిక్కలను వర్ణిస్తున్నారు. మన్మధుడిని శివుడు తన త్రినేత్రంతో భస్మము చేయటం, రతీదేవి ప్రార్థనపై అమ్మవారు అతడిని అనంగుడిగా (అంగములు లేనివాడుగా) అదృశ్యుడుగా రతీదేవికి మాత్రమే కనబడునట్లుగా తిరిగి బ్రతికించటం మనం ఇంతకు ముందు శ్లోకాల్లో చెప్పుకున్నాం.

ఇప్పుడు మన్మధుడు ఎలాగైనా శివునికి పార్వతీదేవికి పరిణయం చేయించవలెననే పట్టుదలతో మళ్లీ తన పుష్పబాణ ప్రయోగం చేయటానికి వచ్చాడు .


పరాజేతుం రుద్రం ద్విగుణశరగర్భౌ గిరిసుతే = ఆ విధంగా ముందు పరాజితుడైన మన్మధుడు ఈసారి రెండు అమ్ములపొదులు ఇరుభుజాల ధరించి వచ్చాడట. ఒక్కొక్కదానిలో అయిదు పుష్పబాణాలు పెట్టుకొని.


నిషంగే జంఘే తే  విషమవిశిఖో బాఢ మకృత = అమ్మవారి కాలిపిక్కలు ఈ అమ్ములపొదులవలె వున్నాయట .


యదగ్రే దృశ్యంతే దశ శరఫలాః పాదయుగళీ = ఆ అమ్ములపొదులనుండి బయటకు వచ్చి కనబడుతున్న ఆ బాణాగ్రములు, అమ్మవారి సుకుమారమైన పాదముల వ్రేళ్ళ వలె వున్నాయట .


నఖాగ్ర చ్ఛద్మాన స్సురమకుటశాణైకనిశితాః = ఆ వ్రేళ్ళకు వున్న నఖములు నునుపుగా మెరుస్తున్నాయట. ఎందువల్లనంటే ముక్కోటి దేవతలు నీకు నమస్కరించినప్పుడు వారి కిరీటములు నీ నఖములకు తాకి అవి నిశితములై మెరుస్తున్నాయమ్మా అంటున్నారు శంకరులు.


           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: