రాజకీయాన
ఎన్ని..కలలో..
కళలో!.
అభ్యర్ధి ఎవరైతే
ఎటువైపు ఉంటే
ఏమి లాభం...
తూగే తూకం సరిపోలేదనో
లెక్క తప్పిందనో
గోడ దాటుతనం..
ఎన్నికల విచిత్రం.
పోరు పందెంలో
పరిగెత్తే గుర్రాల్లో
గెలుపు ఎవరిదో..
అదే సమయంలో అవకాశం కోసం
గోడ మీది దాగిన పిల్లులెన్నో...
కండువాలు మార్చి
రంగులు ఏమార్చి
పూటకొక్క పార్టీ
అదే 'గో-పి' సంగతి.
వల విసిరే పార్టీలు
కావడి మోసే ముఖ్యులు.
తైలం పూసే అభ్యర్ధులకు
అంతా అయో'మయమే.
గెలుపే లక్ష్యంగా
ఓటరు చుట్టూ ప్ర'దక్షణాలు..
కరుణించే దెవరినో....
అంతా రహస్యం...
గప్ చిప్..బ్యాలెట్ చిత్రం..
ఎన్నికల్లో...
ఎన్ని కలలో...
ఎన్ని కళలో...
రంగు వేసే దగ్గరనుండి
రంగు పడే వరకు
అంతా రాజకీయ విచిత్ర విన్యాసం...
చివరికి...
గెలిచిన గుర్రమే
ప్రజాపాలనపై పెత్తనం..
డామిట్...
కధ అడ్డం తిరిగింది.
ఎన్నిక రోజు రాజైన ఓటరేమో
మరో ఐదేండ్లు అయ్యేను బానిస...
ఇక మొదలైంది
రంగుమార్చే ఊసరవెల్లి ''రాజకీయం."
అశోక్ చక్రవర్తి. నీలకంఠం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి