14, డిసెంబర్ 2023, గురువారం

శ్రీ దేవీ భాగవతం

శ్రీ దేవీ భాగవతం


.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః
శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|
నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||
శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|
దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||

శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ
సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |
పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా
సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||

శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |
సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||
బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|
మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||

దేవదేవా ! కరుణానిధీ ! నీ ఆజ్ఞ నెరవేరుస్తాను. వేదోక్తప్రకారంగా భూరిదక్షిణలతో వరుణయజ్ఞం
చేస్తాము. బిడ్డపుట్టిన పదకొండవవాటికి తండ్రికి శుద్ధి. వెలగడిచాక తల్లికి శుద్ధి. అప్పుడుగదా మేమిద్దరం
యజ్ఞానికి అర్హులం అవుతాం ! నువ్వు సర్వజ్ఞుడివి. ధర్మశాస్త్రాలు చదివినవాడివి. అందాకా ఓపికపట్టు అని
వివయంగా అభ్యర్థించాడు.
సరే, మహారాజా ! నీకు శుభమగుగాక! నెల గడిచాక వస్తాను. అప్పుడింక వాయిదా
వెయ్యకూడదుసుమా ! అని చెప్పి వరుణుడు నిష్క్రమించాడు. గండం గడిచిందికదా అని హరిశ్చంద్రుడు
ఊపిరి పీల్చుకున్నాడు. కొడుకుకి రోహితుడు అని నామకరణమహోత్సవం జరిపించాడు. పరిగ్గా వెల
గడిచేపరికి వరుణుడు విప్రవేషంలో ప్రత్యక్షమయ్యాడు. చూస్తూనే హరిశ్చంద్రుడు గడగడలాడిపోయాడు.
సాష్టాంగపడి అతిథిమర్యాదలు అత్యద్భుతంగా జరిపాడు

మహానుభావా ! నీ రాకతో మా గృహం పావనమయ్యింది. యజ్ఞం తప్పకుండా చేస్తాను. అయితే
- దంతాలు రాని పిల్లవాడు యజ్ఞపశువుగా పనికిరాడు అంటున్నారు మా విద్వాంసులు. అంచేత
పాలపళ్ళు వచ్చేదాకానన్నా ఆగు అని అప్పటికి దాటవేశాడు హరిశ్చంద్రుడు. సరేనని వెళ్ళిపోయాడు.
వరుణుడు.
పిల్లవాడికి దంతాలు వచ్చాయి. హరిశ్చంద్రుడికి భయం పట్టుకుంది. వరుణుడు రానేవచ్చాడు.
స్వామి ! బిడ్డడికి ఇంకా పుట్టువెంట్రుకలు తీయించలేదు. ఆ చౌలకర్మ అయ్యేంతవరకూ ఈ గర్భకేశుడు
యజ్ఞవశువుగా పనికిరాడుటగదా! పెద్దలు చెబుతున్నారు. కాబట్టి అప్పటిదాకా మరికాస్త ఓపికపట్టు.
యజ్ఞం తప్పకుండా చేస్తాను. ఆడిన మాట తప్పడం మా ఇంటా వంటా లేదు. నీకు తెలుసుగదా - అన్నాడు
మహారాజు.
రాజా ! నన్ను వంచించాలని చూస్తున్నావు. ఏదో ఒక వంక చెప్పి వాయిదాలు వేస్తున్నావు..
పుత్ర స్నేహానికి లొంగిపోతున్నట్టున్నావు. మిగతా యజ్ఞ సంబారాలన్నీ సిద్ధం చేసుకున్నావుగదా! సరే
ఇప్పటికి వెడుతున్నాను. చౌలకర్మ అయ్యిన తరవాత యజ్ఞం చెయ్యకపోయావో జాగ్రత్త. శపిస్తాను సుమా!
ఇక్ష్వాకువంశంలో పుట్టావు. మాట తప్పకూడదు. గుర్తుంచుకో అంటూ చరచరా నడిచి వెళ్ళిపోయాడు

.

కామెంట్‌లు లేవు: