1, మే 2024, బుధవారం

ప్రశ్న పత్రం సంఖ్య: 26

  ప్రశ్న పత్రం సంఖ్య: 26  కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

ఇది మహిళలకు శ్రావణ మాసపు ప్రేత్యేకం 

 పూర్తిగా బంగారం కాబట్టి. 

క్రింది ప్రశ్నలకు జవాబులు   

  1)బంగారము ఏ రంగులో ఉంటుంది -  పసుపు రంగులో ఉంటుంది 

2) బంగారములో కల్తీ కలపటానికి కంసాలి ఏ లోహాన్ని వాడుతారు . సాధారణంగా రాగినికలుపుతారు 

3) బంగారం నాణ్యత ఏవిధంగా చెపుతారు. - నాణ్యత కరేట్లతో తెలుపుతారు. 

 4) ఈ రోజులలో కంసాలి వారు మజ్దురుతో పాటు ఎంతశాతం తరుగులక్రింద తీసుకుంటున్నారు. - సాధారణంగా 10 శాతం తరుగుల క్రింద తీసుకుంటున్నారు.  

 5) తక్కువ బరువు బంగారాన్ని ఈ గింజ ఎత్తు అని అంటారు అది ఏ గింజ - గురిగింజ 

6) KDM బంగారంలో బంగారం శాతం యెంత ఉంటుంది 92 శాతం బంగారం 8 శాతం కాడ్మియం ఉంటుంది. 

7) ఆర్నమెంట్ బంగారంలో రాగి శాతం యెంత ఉంటుంది - దాదాపు 9 శాతం రాగి ఉంటుంది. 

8) ఒక కారేట్కు ఎన్ని గ్రాములు - 200 మిల్లి గ్రాములు 

9) సేచ్ఛమైన బంగారాన్ని ఆభరణాలు చేయటానికి వాడరు ఎందుకంటె 

1) అది మెత్తగా ఉంటుంది  2) అది చాలా కఠినంగా ఉంటుంది 3) ఇవియేవి నాకు తెలియదు. జవాబు- 1  

10) కంసాలి బంగారాన్ని మీకు తెలియకుండా తీసుకోటానికి వాడే ద్రవ పదార్ధాన్ని ఏమంటారు. - ద్రావకం అంటారు . 

 11) మీరు ఆభరణం చేయటానికి కంసాలి ఇచ్చినప్పుడు వన్నె కన్నా మీ ఆభరణం వన్నె తక్కువగా ఉంటుంది కారణము ఏమిటి. - అందులో రాగి కలపటం వలన 

12) ఎన్ని క్యారట్ల బంగారాన్ని స్వచ్ఛమైన బంగారంగా పేర్కొంటారు. -24 క్యారట్ల బంగారాన్ని  

 13) క్యారెట్ల సంఖ్య తగ్గినా కొద్దీ బంగారం -  నాణ్యత తగ్గుతుంది. 

14) పెద్ద పెద్ద బంగారం షాపులలో రాళ్లకు తూకం లేదు అని ప్రకటిస్తారు దాని అర్ధం ఏమిటి.  

సాదర్బంగా కొంతమంది రాళ్లు వున్నఆభరణాన్ని మొత్తం తూకం వేసి బంగారం ధర వసూలుచేస్తారు కానీ నిజానికి రాళ్లు బంగారంకన్నా తక్కువ ధర కలిగి ఉంటాయి.  రాళ్లను ప్రేత్యేకంగా తూకం వేసి వాటి ధరను వేరుగా తీసుకోవటాన్ని " రాళ్లకు తూకంలేదు" అని ప్రకటిస్తారు. 

15)  ONE GRAM GOLD ఆభరణాలు నిజంగా బంగారంతో చేసినవా? జవాబు: కాదు బంగారం పూత ఉంటుంది. 

16) ద్రవరాజాంలో కలిపే ఆమ్లములు (ACIDs) ఏవి వాటి నిష్పత్తి యెంత. - బంగారాన్ని కరిగించే ద్రావకానికి ద్రవరాజం అంటారు ఇది నైట్రిక్ ఆమ్లము మరియు హైడ్రోక్లోరిక్ ఆమ్లముల్ మిశ్రమము వీటిని 1:3 రేషియోలో కలుపుతారు.  ఇది ప్రమాదకరమైన ద్రవము. 

17)Hallmark gold అనగా ఏమిటీ Bureau of Indian Standards (BIS) వారిచే ఆమోదించబడినది అని అర్ధము. 

 18) బంగారం సాంద్రత యెంత ఉంటుంది - బంగారం సాంద్రత 19,300 kg/m

అందుకే దీనిని హెవీ మెటల్ అంటారు 

19) బంగారం సాంద్రత దానిలో కలిపే రాగి, వెండి, కాడ్మియం మొదలగు లోహాలకన్నా ఎక్కువా లేక తక్కువా - జవాబు తక్కువ 

 20) ప్రపంచవ్యాప్తంగా బంగారాన్ని ఉత్పత్తి చేసే దేశాలలో భారతదేశం ఎన్నవ స్థానంలో వుంది. - భారతదేశం 11 వ స్థానంలో వుంది. 

ఈ ప్రశ్నపత్రం మీకు విజ్ఞానదాయకంగా ఉంటే 

తెలపండి. ఇంకొక ప్రశ్న పత్రంతో మళ్ళి కలుద్దాం. 

కామెంట్‌లు లేవు: