*వంటిల్లనే చిన్న ప్రదేశంలో*
*జీవితాంతం*
*వేల కిలోమీటర్లు*
*నడవాలి విరామం లేదు..*
*కొన్ని నవ్వుల్ని బోనస్ గా కురిపించాలి!*
*వంటిల్లనే చిన్న లేబరేటరీకి*
*జీవితాంతం అంకితమవ్వాలి కృతజ్ఞలు కూడా ఉండవు..*
*కానీ, కొత్త రుచుల్ని క్రియేట్ చేసివ్వాలి*
*పుడమిపై పెద్ద కర్మాగారం వంటిల్లు..*
*ప్రతి పడతీ పదవీవిరమణ లేని కార్మికురాలు..*
*మహిళలకు 'మే'డేలుండవు*
*అందుకే కుటుంబ భారాన్ని మోసే ప్రతీ మహిళకు మే డే శుభాకాంక్షలు💐💐*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి