*
సభ్యులందరి ఎఱుకలో ఉన్న విషయమే మన భారత దేశం *ఆసేతు హిమాచలం విభిన్న సంస్కృతుల, మతాల, కులాల, వర్గాల సంప్రదాయాల సమాహారమని* ముందుగా మన రాష్ట్రం గురించి పరిశీలిస్తే, తెలుగు వారితో బాటు ఆంధ్రులు, కన్నడిగులు, తమిళులు, మరాఠీలు, మహా రాష్టీయులు, అస్సామీలు, రాజస్థానీలు, ఒరిస్సా వాసులు ఇంకా ఎందరెందరో హైందవులు. ఇతర మతస్తులలో ముస్లింలు, కిరస్తానీలు, బౌద్ధులు, జైమినీయులు మరియు కొంత మంది విదేశీయులు గూడా మన రాష్ట్రంలో భిన్నత్వంలో ఏకత్వంలాగా జీవిస్తున్నారు.
ఇతర మతస్తులు, లేదా విదేశీయులు *అందరు దేశ ద్రోహులు కారు*.
గత వ్యాసంలో ప్రస్తావించబడిన హిందు దేశానికి మరియు ధర్మానికి పట్టిన జాడ్యాల, రుగ్మతల మరియు ప్రమాదాల నివారణకు చతుర్విధ బలముల (మనో, బాహు, జన మరియు ధన) శక్తి మరియు చతుర్విధ (సామ, దాన, భేద, దండో) ఉపాయముల అవసరమగు విషయము సభ్యులకు అవగతమే.
ధర్మ మరియు దేశ రక్షణ నేపథ్యంలో లక్షలాది మంది జనాభాను అనుసంధానించాలనే ప్రయత్నం ఒక బృహత్ కార్యమే. *ప్రయత్నిస్తే ఇవన్నీ సాధ్యమే అను భావన కూడా నిర్వాహకులలో దృఢంగా ఉండాలి*.
ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ విధానంలో *Neighbour hood first* అను ప్రణాళిక అమలులో ఉన్నది. ఈ ప్రాతిపదికపై తొలుత *మాన్యులు* మన రాష్ట్రంలో ఉన్న అన్ని సంస్కృతుల, మతాల, కులాల వారిని ఈ హైందవ ధర్మ రక్షణ అను *బృహత్ ప్రణాళిక* అమలుకు ఆహ్వానించాలి.
ఈ కార్యక్రమాన్ని బృహత్ కార్యక్రమం అనడం జరిగింది కాబట్టి ఇందుకు అన్ని వర్గాల సమిష్టి కృషి అవసరము.
మన రాష్ట్రంలో ప్రతి కులానికి, ప్రతి వర్గానికి సంస్థలు, సంఘాలు ఉన్నవన్న విషయం సత్యదూరం కాదు. ప్రతి కులం మరియు ప్రతి వర్గం వారు, *వారి వారి* అభివృద్ధి కొరకు *మాత్రమే* సభలు, సమావేశాలు నిర్వహిస్తూ సామాజిక, ప్రభుత్వ అధికార అధికార పెద్దలను, తత్సంబంధ రాజకీయ నాయకులను దర్శిస్తూ కార్యాలు సాధిస్తున్నారు, స్థితిమంతులుగా (విజయవంతులుగా) ఎదుగుతున్నారు. కార్యక్రమాలన్నీ సజావుగా సాధించుతున్న సంఘ మరియు సంస్థల పెద్దలందరూ అభినందనీయులే. అవుతే, *హైందవ ధర్మ రక్షణ అను అంశము బహు విస్తృతమైనది. ఇందుకు గాను రాష్ట్రంలోని అన్ని సంస్కృతుల, కులాల, వర్గాల నాయకులు మరియు ప్రజలు ఏకం కావాలి. సంస్థలు, సంఘాలు తమ తమ సమావేశాలను మాసవారిగా నిర్ణయించుకున్నా, రాష్ట్రంలోని అన్ని సంఘాల పెద్దలు తమ తమ ప్రాంతాలలో ఒక వేదికపై త్రై మాసిక సమావేశాలు ఏర్పాటు చేసు కొనవల్సిఉన్నది, ఉంటుంది. వీరి ముఖ్య కర్తవ్యం ధర్మ మరియు దేశ రక్షణనే ప్రథమ ధ్యేయంగా ప్రజలను మరీ ప్రధానంగా యువతను ఉత్సాహ, ఉత్తేజ పర్చాలి.*
అన్ని వర్గాలలో ఆత్మ నిర్భరత పెంచాలి, *దేశ ప్రయోజనాలే మిన్నగా* వారిని ప్రోత్సహించాలి. *స్వధర్మ ప్రోత్సాహము మరియు క్షేమము అనుసరణీయమే*.
ధన్యవాదములు.
*(సశేషం)*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి