2, డిసెంబర్ 2024, సోమవారం

మిత్రాజీ కలం నుండి....

 *మిత్రాజీ కలం నుండి........*


మనమే శిలలం. మనమే శిల్పులం. మనమే శిల్పాలం.మనకు మనమే తీర్చి దిద్దుకోవాలి. మన మనస్సును మనమే సంస్కారవంతంగా తీర్చి దిద్దుకోవాలి సంస్కారవంతులంగా మారాలి మన రూపాన్ని అందంగా మలుచుకోవాలి. అంటే మన హృదయాన్ని స్వచ్చంగా, నిర్మలంగా ఉంచుకోవాలి.ధైర్యంతో నిబ్బరంగా ఉండాలి. ఎటువంటి సమస్యనైనా, ఎలాంటి ఉపద్రవమైన ఎదుర్కునేందుకు ఎప్పటికప్పుడు సిద్దంగా ఉంటూ సాహసదృక్పథాన్ని అలవర్చుకోవాలి. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనే ఆశాభావాన్ని, సోమరితన భావాన్ని విడనాడాలి.మన శక్తిపై మనం నమ్మకాన్ని పెంచుకోవాలి మనకు మనమే సంతోషాన్ని, ప్రశాంతతను తెచ్చుకోవాలి.

భగవంతునిఫై భక్తి, అధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి.


తనలో ఎన్ని ఆటుపోట్లు ఉన్నా, ఒడి దొడుకులు ఉన్నా, ప్రకృతి పచ్చగా ఎంతో అందంగా కనిపిస్తూ చూపరులకు ఆనందాన్ని ఇస్తూంది.

తనలో ఎన్ని అలజడులు అల్లకల్లోలం సృష్టిస్తూన్న సముద్రం చూసేవారికి గంభీరంగా ప్రశాంతంగా కనిపిస్తూంది. 


అన్నీ తెల్సి మంచి చెడు ఏదో గ్రహించే మనం అపార జ్ఞాన సంపద కలిగి ఉన్న మనం ఎందుకు బాధ పడాలి. దిగులు ఎందుకు చెందాలి. తప్పులు ఎందుకు చేయాలి. నేరాలకు ఎందుకు ఒడిగట్టాలి. మన ప్రశాంతమైన జీవనానికి మనమే ఎందుకు భంగం కలిగించుకోవాలి.


కష్టంలోనే సుఖం చూసుకోవాలి. అత్యాశలకు అర్రులు చాచకూడదు. ఉన్నదాంట్లో సంతృప్తిని పొందాలి. అందరితో ఆత్మీయతతో కల్సిమెల్సి ఉంటూ ఆనందమైన జీవితాన్ని గడపాలి.క్షణభంగురం అయిన ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. 


భగవంతుడు ఇచ్చిన ఇంత మంచి జీవితం మళ్ళీ వస్తూందా!!?

కామెంట్‌లు లేవు: