🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*జగద్గురు ఆదిశంకరాచార్యులు*
*విరచిత*
*”శివానందలహరి”*
*రోజూ ఒక శ్లోకం*
*పదవిభాగం, తాత్పర్యం, ఆడియోతో*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*ఈ శ్లోకంలో శంకరులు సాయుజ్య ముక్తికి దగ్గర సాధనమైన శివ సాన్నిధ్యమును గూర్చి , తత్తరపాటును ప్రదర్శించారు. కైలాసానికి చేరి శివునికి నమస్కరిస్తూ తన కాలాన్ని సుఖంగా గడపాలనే ఆకాంక్షనూ వెలిబుచ్చారు.*
*శ్లోకం: 24*
*కదవా కైలాసే _ కనకమణి సౌధే సహగణైః*
*వసన్ శంభో రగ్రే _ స్ఫుటఘటిత మూర్థాంజలి పుటః*
*విభో ! సాంబ ! స్వామిన్ ! _ పరమ శివ ! పాహీతి నిగదన్*
*విధాతృూణాం కల్పాన్ _ క్షణమివ వినేష్యామి సుఖతః !!*
*పదవిభాగం :~*
*కదా _ వా _ కైలాసే _ కనకమణి సౌధే _ సహ _ గణైః _ వసన్ _ శంభోః _ అగ్రే _ స్ఫుట ఘటిత మూర్థాంజలి పుటః _ విభో, _ సాంబ _ స్వామిన్ _ పరమశివ _ పాహి _ ఇతి _ నిగదన్ _ వధాతృూణాం _ కల్పాన్ _ క్షణమ్ _ ఇవ _ వినేష్యామి _ సుఖతః.*
*తాత్పర్యం :~*
*కైలాస పర్వతమునందు , మణులతో నిర్మింప బడిన భవనము నందు శివుని ముందు నిలబడి , తలపై చేతులనుంచి నమస్కరిస్తూ "ఓ సాంబా ! ఓ స్వామీ ! ఓ పరమశివా ! నన్ను రక్షించు" అంటూ ప్రార్థిస్తూ వుంటే బ్రహ్మ కల్పములు కూడా క్షణ కాలమువలె ఎప్పుడు సుఖంగా గడుపుతానో కదా ! అని శంకరులు తమ తహ తహను వెలిబుచ్చారు.*.
*వివరణ :~*
*ఎక్కువగా సంతోషాన్నిచ్చే కాలక్షేపాలతో దీర్ఘకాలం కొద్దిగా, ఇష్టం లేని పనులు చేయడంలో కొద్ది కాలం సైతం దీర్ఘకాలముగా కనబడడం మనందరికీ అనుభవసిద్ధమే. నచ్చిన వినోదాలతో గడిపేటప్పుడు కాలం ఎంతయిందో ఎవరూ గుర్తింపరు. గాఢమైన సుషుప్తి సుఖంలో కాలం ఇట్టే గడచి పోతుంది.*
*ఇక్కడ శంకరులు తాను కైలాసం వెళ్ళి , శివుని సన్నిధిలో ప్రమథ గణాలతో నిలిచి , శివునికి నమస్కరిస్తూ "ప్రభూ ! రక్షించు, స్వామీ ! కాపాడు " అంటూ పెక్కు యుగాల కాలాన్ని నిముషములా గడుప గలనని వారు ఊహల్లో తేలిపోయారు.*
*(తరువాయి శ్లోకం రేపు అధ్యయనం చేద్దాం.)*
*ఓం నమఃశివాయ।*
*నమః పార్వతీ పతయే హర హర మహాదేవ॥*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*క్రొత్తగా నేర్చుకుంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి