ప్రణవ స్వరూపుడు , ప్రమద గణాధిపతి ,పార్వతీ పరమేశ్వరుల ప్రియ పుత్రుడు - సకల జగతికి ప్రేమపాత్రుడైన గజముఖుడి రూపాన్ని గుండెనిండా నింపుకున్న పోతన తన ఘంటం నుంచి తెలుగు జాతికి అందించిన ఆణిముత్యం, ఈ గణేశుడి పద్యం.
****
ఆదరమొప్ప మ్రొక్కిడుదు - నద్రిసుతా హృదయానురాగ సం
పాదికి - దోష బేధికి - బ్రపన్న వినోదికి - విఘ్నవల్లికా
చ్ఛేదికి - మంజువాదికి - నశేష జగజ్జన - నందవేదికిన్
మోదక ఖాదికిన్ - సమద మూషకసాదికి - సుప్రసాదికిన్
****
హిమగిరినందిని హృదయానురాగాన్ని పొందినవాడు, కలిపురుషుని దోషాలను తొలగించువాడు ,ఆశ్రితుల విఘ్నాలను ఛేదిస్తూ ,ప్రపన్నులను ఆనందింపజేస్తూ తన మధుర భాషణలతో అందరికీ ఆనందాన్ని ఇచ్చు వాడు,మోదక ప్రియుడు ,మూషకము (ఎలుక) ను అధిరోహించు వాడు, ముదమును కలుగ జేయువాడైన ఆ వినాయకుని నేను సభక్తికంగా మ్రొక్కుతున్నాను. అంటూ తెలుగుజాతి చేత ఆనాటినుంచి గణపయ్యకు ఈ పద్యంతో మనచేత అక్షరార్చన చేయిస్తున్నాడు పోతన.
🏵️పోతన పలుకులు---భక్తిరస గుళికలు🏵️

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి