శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్ల్యాం రామ నామ వరాననే!!* ఈ పాదాలకు అర్థం శ్రీరామ అని మూడు సార్లు ఉచ్ఛరిస్తే అది వేయి సార్లు జపించిన దానికి సమానమని అర్థం.
అలాగే జగద్గురువయిన సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్మ శబ్దానికి కూడా విశేష ఫలితం ఉంది. తన పిన్నవయసులోనే గోవర్ధనగిరి ఎత్తి తన ప్రజలను కాపాడడం తోపాటు అనేక సందర్భాల్లో ఎన్నో విధాలుగా ప్రజలను ఆదుకున్న పరమాత్ముడు కృష్ణుడు.
ఆ దేవదేవుడు దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం త్రేతాయుగంలో రామావతారంలో సామాన్య మానవుడిగా జన్మించి ఎటువంటి దైవిక శక్తులు ఉపయోగించకుండా మితహిత సత్య వాక్పరిపాలకుడుగా, మర్యాద పురుషోత్తముడు గా ప్రసిద్ధి చెంది రాక్షస సంహారం చేసి, ద్వాపరయుగం నాటికి ప్రజలలో పెరిగిన అధర్మాన్ని అంతమొందిచి, ధర్మసంస్థాపనకై దైవ శక్తులు కలిగిన శ్రీకృష్ణ అవతారం ఎత్తి ఎందరో రాక్షసులు సంహారం చేసి శ్రీకృష్ణ భగవానుడుగా ప్రసిద్ధి చెంది, జగద్గురువుగా కొనియాడబడ్డాడు. అటువంటి ఉత్కృష్టమైన శ్రీకృష్ణ శబ్దం ప్రయోగమే కృష్ణం వందే జగద్గురం. అజ్ణానాంధకరంలో కొట్టిమిట్టాడుతున్నా ఎందరో అభాగ్యుల పాలిటి వెలుగు కిరణం కృష్ణం వందే జగద్గురం.
*వసుదేవ సుతం దేవం కంసాచారూణ మర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురం*............... శ్రీ కృష్ణాష్టకంలో ప్రతీ పాదం కృష్ణం వందే జగద్గురంతోనే ముగిస్తుంది. ఈ మంత్రం పారాయణం భాగవత పారాయణం ఫలితంతో సమానమని పురాణ పండితులు ప్రస్తుతించారు . నేటి ప్రాపంచిక పరిస్థితులను గమనించి మానవునకి మరింత దైవ బలం అవసరమని భావించి తొలి ఏకాదశితో ప్రారంభమైన చాతుర్మాస్యం సందర్భంగా అవధాని గారు ఆ ప్రయోగం చేశారని నా అభిప్రాయం.
ఇది నా పరిశీలన మాత్రమే.
భవదీయుడు
*దశక ప్రభాకరశాస్త్రి*
9849795167
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి