7, ఆగస్టు 2020, శుక్రవారం

రామాయణమ్. 23


..
ఓ బ్రహ్మర్షీ! నా తల్లిని రాముడు చూసినాడా? ఆమెను అనుగ్రహించినాడా?
మరల నా తండ్రి అచటికి ఏతెంచినాడా? నా తల్లితండ్రులు ఇరువురూ సంతోషముగా కలసినారుకదా!
రాముడు వారి ఆతిధ్యమును స్వీకరించెనా? నా తల్లిదండ్రులు రామునకు ఫలపుష్పాదులొసగినారుకదా!
.
ఇలా ఒకదానివెంట మరొక ప్రశ్న సంధిస్తూ వెడుతున్న శతానందులవారికి విశ్వామిత్రుడు చిరునవ్వుతో ఒకే ఒక సమాధానం చెప్పారు.
"నాయనా ,జరుగవలసిన వెల్ల జరిగినవి నా కర్తవ్యము నేను నిర్వహించితిని. ఆ మాటలు విన్న శతానందుడు...ధన్యుడనయితిని ఓ రామచంద్రా నీవు నా తలితండ్రులకు ,కుటుంబమునకు చేసిన మేలు మరువలేనిదయ్యా!
.
నీవుకూడా ధన్యుడవయితివయ్యా! అనితర సాధ్యమైన బ్రహ్మర్షిపదాన్ని స్వయం కృషితో అందుకున్న ఈ మహాతేజోసంపన్నుడైన విశ్వామిత్రుని శిష్యరికము నీకు లభించినది.
.
ఈయన సామాన్యుడనుకున్నావా! కాదు ,కాదు! ఈయన ఒక్కడే!(unique) .చరిత్రలో మరొకరులేరు.
.
ఒక సామాన్య రాజుగా జన్మించి రాజర్షియై,ఋషియై,మహర్షియై,బ్రహ్మర్షిఅయిన ఈయన చరిత్ర అత్యంత స్ఫూర్తి దాయకం ,ఆదర్శవంతము.
.
ఒక లక్ష్యము కోసము పట్టువిడవక వేల ఏండ్లు తపస్సు చేసి సాధించిన మహోన్నతమయిన వ్యక్తి విశ్వామిత్రమహర్షి! .
.
తపస్సు ద్వారా మనస్సులోని మలినములు ఒక్కొక్కటిగా తొలగించు కుంటూ మనస్సు అత్యంత పరిశుద్ధమైన మానససరోవరంగా మార్చుకున్న వాడయ్యా ఈయన !
.
ఈయన చరిత్ర మానవాళికి అందించే పాఠం అత్యంత విలువైనది ! .ఈ చరిత్ర కార్యసాధకుడైన ప్రతి వ్యక్తి హృదయంలో స్ఫూర్తి రగిలిస్తుంది!
.
రామచంద్రా ఈ బ్రహ్మర్షిగూర్చి నీకు వివరించ ప్రయత్నం చేస్తాను.
.
అంటూ శతానందులవారు విశ్వమిత్రమహర్షి చరిత్ర చెప్పటం మొదలుపెట్టారు!.
.

జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....

కామెంట్‌లు లేవు: