.
గౌతమ మహర్షి ఆతిధ్యం స్వీకరించిన పిదప విశ్వామిత్ర మహర్షి ఈశాన్యదిక్కుగా ప్రయాణమయినాడు.
అన్నదమ్ములిరువురూ ఆయనను అనుసరించినారు.
.
జనకుడి యజ్ఞ శాల ప్రవేశించారు మహర్షి!.
.
మహాత్ముడు అయిన విశ్వామిత్ర మహర్షి రాక తెలిసికొని జనకమహారాజు తన పురోహితుడైన శతానందులవారిని వెంట నిడుకొని అతిశీఘ్రముగా ఆయన వద్దకు చేరి అర్ఘ్యపాద్యాదులొసగి ఆ మహానుభావుని తగురీతిని సత్కరించి అంజలి ఘటించి నిలుచున్నాడు.
.
జనకుడిని యజ్ఞము ఏవిధముగా జరుగుతున్నదో అడిగి తెలుసుకున్నారు మహర్షి.
.
అప్పుడు జనకుడి మదిలో ఒక ఉత్సాహమేర్పడి ,
మహర్షివెంట ఉన్న ధనుర్ధారులైన రాకుమారులెవరో తెలుసుకోవాలని కోరిక కలిగింది.
.
మహర్షీ వీరిరువురూ ఎవరు?
పద్మపత్రాల వంటి కన్నులు,
అశ్వినీ దేవతల సౌందర్యం,
దేవతాసమానపరాక్రమము,
గజ సింహ సమానమయిన నడక ,
చూడగానే దేవతలవలే కనపడే ఈ బాలురెవ్వరు?
ఎవరివారు? నీతో కాలి నడకనే ఇచ…
[7:15 am, 06/08/2020] +91 98585 53366: శుభోదయం
అసత్యంతో సాధించిన విజయం కంటే
సత్యమార్గంలో నడచి పొందిన ఓటమి గొప్పది.
🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞
[11:03 am, 06/08/2020] +91 98585 53366: రామ జన్మభూమి ..ఇవ్వాళ మన సొంత మవడానికి కారనమైన ఒక మహానుభావుణ్ణి స్మరించుకోవడం మరిచి పోయాం... అందుకని.
అతడు ఎవరో కాదు మన పుల్లారెడ్డి స్వీట్స్ పుల్లారెడ్డి గారు 🙏🏼
ఒకసారి వారి గురించిన క్లుప్తంగా తెలుసుకొని పునీతులవండి..
🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
అయోధ్య రామ జన్మభూమి ఆందోళన అని మాట పలికితే దాని వెనుక మరొక అవి స్మరణీయ దిగ్గజం.....స్వర్గీయ పుల్లారెడ్డి గారు...
ఆ రోజుల్లో కోర్టులో కేసు వాదించడానికి రోజుకు లక్షల్లో ఖర్చు వస్తున్నందున...
ఢిల్లీ VHP కార్యాలయంలో ఆర్థిక సంకటం ఏర్పడింది.
కోశాధికారిగా ఉన్న పుల్లారెడ్డి గారి దగ్గరికి అశోక్ సింగల్ గారు వచ్చారు .
అప్పటికి ఇరవైఐదు లక్షలు సమీకరించాలి .
లక్షల రూపాయలు సంగ్రహించడం అప్పటికప్పుడు కష్టంగా ఉన్న సమయం. బాధపడుతూ హైదరాబాద్ వచ్చారు .
పుల్లారెడ్డి గారి ఇంట్లో కూర్చొని మాట్లాడుతుండగా....
ఇంట్లోకి వెళ్లి వచ్చి చ…
[6:28 am, 07/08/2020] +91 98585 53366: రామాయణమ్. 23
..
ఓ బ్రహ్మర్షీ! నా తల్లిని రాముడు చూసినాడా? ఆమెను అనుగ్రహించినాడా?
మరల నా తండ్రి అచటికి ఏతెంచినాడా? నా తల్లితండ్రులు ఇరువురూ సంతోషముగా కలసినారుకదా!
రాముడు వారి ఆతిధ్యమును స్వీకరించెనా? నా తల్లిదండ్రులు రామునకు ఫలపుష్పాదులొసగినారుకదా!
.
ఇలా ఒకదానివెంట మరొక ప్రశ్న సంధిస్తూ వెడుతున్న శతానందులవారికి విశ్వామిత్రుడు చిరునవ్వుతో ఒకే ఒక సమాధానం చెప్పారు.
"నాయనా ,జరుగవలసిన వెల్ల జరిగినవి నా కర్తవ్యము నేను నిర్వహించితిని. ఆ మాటలు విన్న శతానందుడు...ధన్యుడనయితిని ఓ రామచంద్రా నీవు నా తలితండ్రులకు ,కుటుంబమునకు చేసిన మేలు మరువలేనిదయ్యా!
.
నీవుకూడా ధన్యుడవయితివయ్యా! అనితర సాధ్యమైన బ్రహ్మర్షిపదాన్ని స్వయం కృషితో అందుకున్న ఈ మహాతేజోసంపన్నుడైన విశ్వామిత్రుని శిష్యరికము నీకు లభించినది.
.
ఈయన సామాన్యుడనుకున్నావా! కాదు ,కాదు! ఈయన ఒక్కడే!(unique) .చరిత్రలో మరొకరులేరు.
.
ఒక సామాన్య రాజుగా జన్మించి రాజర్షియై,ఋషియై,మహర్షియై,బ్రహ్మర్షిఅయిన ఈయన చరిత్ర అత్యంత స్ఫూర్తి దాయకం ,ఆదర్శవంతము.
.
ఒక లక్ష్యము కోసము పట్టువిడవక వేల ఏండ్లు తపస్సు చేసి సాధించిన మహోన్నతమయిన వ్యక్తి విశ్వామిత్రమహర్షి! .
.
తపస్సు ద్వారా మనస్సులోని మలినములు ఒక్కొక్కటిగా తొలగించు కుంటూ మనస్సు అత్యంత పరిశుద్ధమైన మానససరోవరంగా మార్చుకున్న వాడయ్యా ఈయన !
.
ఈయన చరిత్ర మానవాళికి అందించే పాఠం అత్యంత విలువైనది ! .ఈ చరిత్ర కార్యసాధకుడైన ప్రతి వ్యక్తి హృదయంలో స్ఫూర్తి రగిలిస్తుంది!
.
రామచంద్రా ఈ బ్రహ్మర్షిగూర్చి నీకు వివరించ ప్రయత్నం చేస్తాను.
.
అంటూ శతానందులవారు విశ్వమిత్రమహర్షి చరిత్ర చెప్పటం మొదలుపెట్టారు!.
.
జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....
ధర్మధ్వజం
హిందు చైతన్య వేదిక
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి