28, ఆగస్టు 2020, శుక్రవారం

ఫోటో పద్య కవితలు



ఫై ఫోటో చూసి చెప్పిన పద్యాలూ

చంపకమాల:
జలకములాడుచున్ చిలిపి సామజవక్తృడు తుండమెత్తి త
మ్ముల రసగంధపూరముల స్ఫూర్తి వెలార్చి వసంతమాడుచున్
కలకలనవ్వు తమ్ముని మొగంబున జల్లగ నాతడందమై
పులకలుజెందె; నట్టి ఘనమోహనమూర్తుల గొల్తు నమ్రతన్

తమ్ములు=తామరపూవులు
తమ్ముని మొగంబున=తమ్ముడైన కుమారస్వామి ముఖమందు
భావం: సరస్సులో స్నానంచేస్తూ గజముఖుడయిన వినాయకుడు తన తొండమును పైకెత్తి పద్మములయొక్క సుగంధములతో నిండిన నీటిని నవ్వుచూ తన తమ్ముడైన కుమారస్వామి ముఖంపై చల్లి వసంతమాడగా, ఆ కుమారస్వామి కూడా సంతోషంతో పులకించిపోయాడు. అటువంటి ఆ సుందరరూపులిద్దరికీ వినయంతో నమస్కరిస్తున్నాను.
                                   ✍️శ్రీశర్మద.




విఘ్న ములబాపి దీవించు పెద్ద వేల్పు
ప్రణవ భాష్యము చెప్పిన పండితుడును
మాత పుట్టింటి కరగిన మనుమలవలె
ఆద మరచి తామాటలనాడుచుండె
--పోపూరి అరుణశ్రీ

కామెంట్‌లు లేవు: