5, జనవరి 2021, మంగళవారం

పంతొమ్మిదవ రోజు పాశురం*_

 _ *తిరుప్పావై పంతొమ్మిదవ రోజు పాశురం*_ 


 


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

 


 

*🌴19. వ పాశురము🌴*



    *కుత్తువిళక్కెరియ క్కోట్టుక్కాల్ కట్టిల్ మేల్* 

    *మెత్తెన్ఱ పఞ్చశ యనత్తిన్ మేలేఱి ,*

    *కొత్తలర్ పూఙ్కుళల్ నప్పిన్నై కొఙ్గైమేల్* 

   *వైత్తుక్కి డన్దమలర్* *మార్ పా ! వాయ్ తిఱవాయ్*

    *మైత్తడ జ్కణ్నినాయ్ నీ యున్మణాళనై*

    *ఎత్తనై పోదుమ్ తుయిలెళ వొట్టాయికాణ్* 

    *ఎత్తనై యేలుమ్ పిరివాత్తగిల్లాయాల్*

    *తత్తువ మన్ఱుతగవేలో రెమ్బావాయ్*



*🌳భావం :🌳*



గుత్తి దీపపు కాంతులు నలుదిశలా వెలుగులు ప్రసరించుచుండగా ఏనుగు దంతములచే చేయబడిన కోళ్లు గల మంచము మీద అందము , చలువ , మార్దవము , పరిమళము , తెలుపులనే - ఐదు గుణములు కలిగిన హంస తూలికా తల్పముపై పవ్వళించియుండు గుత్తులు గుత్తులుగా వికసించిన పువ్వులచే అలంకరించబడిన శిరోజములు కలిగిన నీళాదేవి యొక్క స్తనములను తన విశాల వక్షస్థలముపై వైచుకొని పవళించియున్న ఓ స్వామీ ! నోరు తెరచి ఒక్క మాటైననూ మాట్లాడకూడదా ? లేక కాటుకచే అలంకరింపబడిన విశాలమైన నేత్రములు కల ఓ నీళాదేవీ ! జగత్స్యామియైన శ్రీకృష్ణుని స్వల్పకాలమైనను పడక విడిచి బయటకు వచ్చుట కనుమతింపకున్నావు ! క్షణమైనను శ్రీకృష్ణుని విశ్లేషమును సహింపజాలవే ? ఇది నీ స్వరూపమునకు , నీ స్వభావమునకును తగదు. నీవలె మేము కూడా అతనికి అనన్యార్హ శేషభూతులమేకదా ! కాన కరుణించి కొంచెమవకాశమీయము తల్లీ ! అట్టి అవకాశము నీవిచ్చితివేని మేము చేసే యీ అద్వితీయమైన ధనుర్మాస వ్రతము భగవత్కైంకర్యరూప మంగళ వ్రతముగా సాంగోపాంగముగ సమాప్తి చెందును. ఇందేమాత్రమూ సంశయము లేదు అని ఆండాళమ్మగారు నీళా శ్రీకృష్ణులను వేడుకొంటున్నారు.  




*☘️అవతారిక :☘️*




స్వామిని కీర్తించటానికి వచ్చామని , తన సుకుమారమైన చేతులకున్న గాజుల మధుర ధ్వనితో తలుపును తెరువుమని నీళాదేవిని ఆండాళ్ తల్లి ప్రార్ధించింది. ముందు (ఆ పాశురంలో) ఇప్పుడీ మాలికలో - ఆండాళమ్మగారి ప్రార్ధన నాలకించి నీళాదేవి తలుపు తెరవబోగా , మనవారి కెదురుగా ముందు యీమె వుండరాదని శ్రీకృష్ణుడు యీమెను తలుపు తెరవనీయక ఆమెను బిగ్గ కౌగలించి పడకనుంచి లేవనీయకయుండే శ్రీకృష్ణుని మేల్కొలపమని అతడు మాట్లాడకయుండగా - అతనిని మేల్కొలుపుమమ్మాయని ఆండాళమ్మగారు నీళాదేవిని పదేపదే వేడుకొంటున్నారు.         



*🌹19. వ మాలిక🌹*



*(కాపిరాగము - ఆదితాళము)*


ప.. తగదిది నీకిది తరుణిరొ వినవే !

    జాగు సేయకే శ్రీకృష్ణుని లేపవె !


అ..ప. తగునా ? నీ స్వరూప స్వభావమ్ములకు 

    మగని విశ్లేషమును సహింపజాలవె !

    దీప కాంతులెల్లెడళ విరియగా 

    ఆ పంచగుణముల పడకను శయనించి 

    సుపుష్ప సుగంధ కచ కుచ శోభిత 

    శ్రీ పద్మాక్షుని మాటాడనీయవె !

    ఓ పద్మాక్షీ ! విభుని లేపవే !

కామెంట్‌లు లేవు: