12, మార్చి 2021, శుక్రవారం

అరుణాచల శివ 🙏

 అరుణాచల శివ 🙏



🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹


ఉత్తర భారతదేశానికి చెందిన భక్తుడు ఒకరు ఒక చీటీ వ్రాసి భగవాన్! చేతికి ఇచ్చారు.


 ఆ చీటీలో ఉన్న విషయం.....

 "బృందావనంలో శ్రీ కృష్ణుని నిజస్వరూపం దర్శిస్తే, నా కష్టాలన్నీ తొలగించుకొనే శక్తి లభిస్తుందా? వారిని దర్శించి నా భారమంతా అర్పించాలని కోరికగా ఉన్నది."


 భగవాన్! ఆ చీటీ చూసి ఇలా సెలవిచ్చారు....


 "దానికేమి అట్లే చేయవచ్చును. 


వారిని చూచిన వెనుక మన భారమంతా వారి పైనే ఉంటుంది. 


ఇప్పుడు మాత్రం ఆ చింత మీకెందుకు? భారమంతా వారిపైనే వేస్తే సరికదా! వారే చూచుకుంటారు."


    మరలా ఆ భక్తుడు ఇలా అడిగారు....

       "నేనిప్పుడు ఆ కృష్ణుని నిజరూపం చూడాలంటే బృందావనానికి వెళ్లి వారిని

ధ్యానించాలా? ఎక్కడ ఉండి ధ్యానించినా సరేనా?".


    భగవాన్! ఇలా సెలవిచ్చారు....


"తన ఉనికి తానెరిగి తానెక్కడుంటే అక్కడే బృందావనం గాని, ఎక్కడో బృందావనం ఉన్నదని పరగెత్తనక్కర లేదు. వెళ్ళవలెనన్న తీవ్రత కలవారు వెళ్ళవచ్చునే గాని, వెళ్ళకుంటే లాభం లేదన్న నిబంధన ఏమున్నది".


    భగవద్గీతలో  సెలవిచ్చినట్లు....

  

అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థితః

అహమాదిశ్చ మధ్యంచ భూతానా మంత ఏవచ"


 తానున్న చోటే బృందావనం. తానెవరో, తన ఉనికి ఏదో విచారించి, తెలుసుకుంటే తానే కృష్ణుడౌతాడు, సకల విషయ వాసనలూ తనలో అణుగుటయే

తన్నర్పించుకొనుట. 

 

ఆ తర్వాత మన భారం అతనిదే కదా!!!


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹

కామెంట్‌లు లేవు: