*'అష్టావక్రగీత' 11, 12 ప్రకరణల నుండి (269)*_
🕉🌞🌎🌙🌟🚩
_*ప్రాంగు, కృంగులే అహంకార సంకేతాలు !!*_
_*అతి స్పందనలే అశాంతికి గుర్తు. కష్టంలో, సుఖంలోనూ స్పందన తప్ప ప్రతిస్పందనలు ఉండని మహానుభావుల జీవితాలు మనకు ఆ విషయాన్నే బోధిస్తున్నాయి. వారు చూపించే అభిమానం, అనురాగాల వెనుక సహజ ప్రేమ తప్ప ఏదీ ఆశించడం ఉండదు. వారు యుద్ధంచేసినా కర్తవ్యంతో తప్ప కక్షతో చేయరు. రాగద్వేషాలు లేని సామ్యక్ జీవనమే వారి బోధ. అంతపెద్ద కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు ఒక రథసారధిగా సాక్షిగా ఉండిపోయాడు. యుద్ధంలో అలసిపోయిన శత్రువు రావణాసురుడిని రేపు రమ్మని ప్రేమ చూపించాడు శ్రీరాముడు. సంతోష దుఃఖాల్లో వ్యక్తమయ్యే ప్రాంగు, కృంగులు అహంకార సంకేతాలు. ఆ ప్రాంగు, కృంగుల్ని పరిహరించగలిగితే సంతోషదుఖాలు రెంటిలోనూ చెదరని శాంతి నిండి ఉండటం గమనించ గలుగుతాము.*_
🕉🌞🌎🌙🌟🚩
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి