30, మే 2021, ఆదివారం

అష్టస్థాన పరీక్ష

 ఆయుర్వేదం నందు గల అష్టస్థాన పరీక్ష గురించి సంపూర్ణ వివరణ  - 


  మనుష్యునకు సంభవించు సమస్త వ్యాధులకు మొదట 8 స్థానములను పరీక్షించవలెను .  అవి 


 1 - నాడి , 2 - స్పర్శము ( తాకుడు ) , 3 - రూపము , 4 - శబ్దము , 5 - నేత్రములు , 6 - పురీషము , 7 - మూత్రము , 8 - జిహ్వ   


      ఇప్పుడు వీటి గురించి మీకు వివరిస్తాను.  


 * నాడి  - 


       దీనిని ఆంగ్లము నందు " pulse " అందురు. రోగమును గుర్తించుటకు ఈ నాడీ పరీక్ష అద్భుతముగా పనిచేయును . ఒకసారి గాలిని లోపలికి పీల్చి , బయటకి వదిలిన 4 సార్లు నాడీస్పందన కలుగును.  


        వయస్సుని అనుసరించి నాడీస్పందన తెలుసుకొనవలెను . 


  గర్భము నందలి పిండము నాడి స్పందన  150 నుంచి 130 వరకు ఉండును. 


  శిశువు పుట్టగానే  నాడీ స్పందన 140 నుంచి 130 వరకు ఉండును . 


 1 సంవత్సరం లోపున నాడీస్పందన 130 నుంచి 115 వరకు ఉండును. 


 2 సంవత్సరాల లోపున నాడీస్పందన 115 నుంచి 100 వరకు ఉండును. 


 3 సంవత్సరాల లోపున నాడీస్పందన 100 నుంచి 90 ఉండును. 


 7 సంవత్సరం నుండి 14 సంవత్సరం వరకు నాడీస్పందన 90 నుంచి 75 ఉండును.


 14 వ సంవత్సరం నుంచి 20 వ సంవత్సరం వరకు 85 నుండి 75 వరకు ఉండును . 


 21 సంవత్సరం నుండి 60 సంవత్సరం వరకు 75 నుంచి 65 వరకు ఉండును. 


 60 సంవత్సరాల పైన  85 నుంచి 75 వరకు నాడీస్పందన ఉండును. 


      రక్తక్షీణత , జీర్ణజ్వరము , దౌర్బల్యము , భోజనం చేసినపిమ్మట , మలవిసర్జన చేసిన తరువాత నాడీ క్షీణించును. జ్వరాదుల యందు నాడీపరీక్ష చేసినప్పుడు మరియు ఎంత వ్యాధి ఉన్నను , వయస్సులో ఉండువానికి 120 కంటే నాడీస్పందన మించరాదు. 


              ఆయుర్వేద శాస్త్ర ప్రకారం నాడిని 8 చోట్ల పరీక్షించవలెను . హస్తము , పాదము , కంఠము , నాస ఈ నాలుగు భాగముల యందు ఒకొక్క దాని యందు 2 చొప్పున మొత్తం 8 నాడీ స్థానములు ఉండును. రెండు చేతుల మణి బంధములు , రెండు పాదముల చీలమండల యందు , ముక్కుకి రెండు ప్రక్కలా , కంఠము కు రెండువైపులా నాడీపరిక్ష చేయవలెను . 


      హస్తనాడి శరీరం అంతయు వ్యాపించి వాత , పిత్త , కఫములను , రసరక్తములను మొదలగు విషయములకు బాధ్యతకారిగా ఉండును. ఇది మన బొటనవ్రేలి మూలము నందు 3 వేళ్లు కలిసి ఉండు చోట ధాన్యపు గింజ పరిమితిన చరించుచుండును. దీని ద్వారా మన ఉచ్చ్వాస , నిశ్చ్వాసముల గమనము బాగుగా తెలియును . 


          ఇది జీవసాక్షి అయ్యి శరీరం యొక్క ఆరోగ్య , అనారోగ్యములును సరైన కాలం తెలుపు గడియారం వలే స్పష్టముగా తెలియచేయును . మన ఉచ్చ్వాస , నిశ్చ్వాసములు శరీరం అంతయు వ్యాపించుచుండును. అట్లు వ్యాపించు సమయమున శరీరం నందు ఎటువంటి ఒడిదుడుకులు లేకున్న  నాడి సమముగా ఉండును ఎక్కడన్నా దోషము ఉండి ఉచ్చ్వాస , నిశ్చ్వాసములు ఒడిదుడుకులు ఎదురైనచో ఈ నాడి గమనం తేడావచ్చి నెమ్మదిగా జలగ , పాము వలే సంచరించును . లేదా తొందరగా , ఎగురుచూ సంచరించును. 


      తరవాతి పోస్టు నందు మరింత విలువైన సమాచారం మీకు అందిస్తాను . 


     గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు  "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . మీకు కొరియర్ ద్వారా వస్తాయి.  పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు . రెండు గ్రంథముల ఖరీదు కొరియర్ ఛార్జీలతో కలిపి 900 రూపాయలు . 


                 కాళహస్తి వేంకటేశ్వరరావు 


             అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                         9885030034

కామెంట్‌లు లేవు: