కుసంస్కారులు
బధిరుని ముందు శంఖారావం
ఆంధుని ముందు దర్పణం
మూగవాని ముందు కంఠ శోష
మూర్ఖుని కి హిత బోధ
సైకత మందుండి తైల ప్రయత్నం
ఎడారి లో నీటికోసం శోధన
వాయసాన్ని చూసి పికమనుకుని
భ్రమించడం
ఆమాస నిశిలో వెన్నెల కోసం తపించడం
కురూపిని అందగత్తె అని తలచడం
కడకు విద్యా ధిక. తా మదంతో
అధములు కూడా అధికులై
సాహితీ కుసంస్కారులై
తమ కంటూ ఓ అంధకారపు గిరి
గీసుకుంటూ
సహితేన కావ్యం సాహిత్యమం టూ
కుక్క పిల్లను
అగ్గి పుల్లను
సబ్బు బిళ్ళ నూ
కావేవీ కవితకు అనర్హ మంటూ
సంబోధించి నా
భాష్య కారులూ ఉటం కించినా
మార రెందుకో వీరు
నిజం చెప్పాలంటే......నిజంగా
వీరే కుసంస్కారు లు.
దోస పాటి.సత్యనారాయణ మూర్తి.
రాజమహేంద్రవరం
9866631877
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి