తులసి శాస్ర్తీయ నామం ‘ఆసియం బాసిల్లి కామ్’. ఇది ‘లాబియేటీ’ కుటుంబానికి చెందినది. ఇది హిందువులకు పూజా వస్తువుగా ఉపయోగపడుతున్నప్పటికీ, 16వ శతాబ్దం లోనే ఐరోపా దేశాలలో దీని పరిచయం వుందనే చారిత్రక ఆధా రాలను శాస్తవ్రేత్తలు వివరిస్తున్నారు. అంతకు ముందే తులసిని మన దేశ వాసులు పూజించినట్లు పురాణ, ఇతిహాసాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా తులసికి ప్రధాన్యత ఉందన్న సంగతి చరిత్ర చెపుతున్న సత్యం. 180 రకాల తులసి మొక్కలు న్నట్లు పరిశోధకులు అభిప్రాయ పడుతున్నారు. మన దేశంలో మాత్రం ఏడు తులసి రకాలే ఉండటం గమనించదగ్గ విషయం.
1. కృష్ణ తులసి, 2. లక్ష్మి తులసి, 3. విష్ణు తులసి, 4. అడవి తులసి, 5. రుద్ర తులసి, 6. మరువక తులసి, 7. నీల తులసి.వేద కాలం నుంచి తులసిని దేవతా వృక్షంగా మొక్కగా భావించి పూజలు చేస్తున్నారు. పుణ్యక్షేత్రాల్లో సైతం తులసి వనాలను పెంచుతున్నాయి. సుప్రసిద్ధ పుణ్య క్షేత్రం ‘పండరీపురం’లో అతిపెద్ద తులసి వనముంది. కార్తీక మాసంలో నిత్యం ఒక తులసి దళాన్ని విష్ణువుకు సమర్పించిన వారికి సహస్ర గోదాన ఫలితాన్ని విష్ణువు ప్రసాదిస్తాడని ప్రతీతి. ఆషాఢ మాసంలో నిత్యం తులసి దళాలతో వున్న నీటితో విష్ణువుని అభిషేకిస్తారో వారిక మోక్షం సిద్ధిస్తుందని నమ్మకం. మాఘ మాసంలో నిత్యం విష్ణువు పవళించే పానుపుపెై తులసి దళాలు వుంచిన వారికి విష్ణుమూర్తి కరుణా కటాక్షాలు సిద్ధిస్తాయని చాలా మంది నమ్ముతారు. శ్రీకృష్ణతులాభారంలో తులసి పాత్ర అసాధారణ మని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
ఎన్నో మణుగుల బంగారానికి తూగని కృష్ణుడు రుక్మిణీ దేవి ఒక్క తులసి దళం త్రాసులో వుంచితే, ఆ అద్భుత ఫలితం వల్ల శ్రీ కృష్ణుని రుక్మిణీ సొంతం చేసుకోగలిగింది. తులసి మూలంతో సమస్త తీర్థాలు, కొనల యందు సమస్త వేదాలు, మధ్యలో సమస్త దేవతలు దీగి ఉం టారు. తులసి చెట్టు (మొక్క) చుట్టూ ప్రదక్షిణ చేసి, సాష్టాంగ నమస్కారమాచరించిన వరాఇకి భూప్రదక్షిణ చేసినంత పుణ్యం దక్కుతుంది. తులసికి ప్రత్యేక అర్థాన్ని కూడా నిర్ధారించారు. ‘తు’ అంటే మృత్యువు, ‘లసి’ అంటే దిక్కరించుది. మృత్యువుని దిక్కరించగలది, తప్పించగలది అని తులసిగా చెప్పవచ్చు.
తులసి ఆకులో పోషక విలువలు:
తులసి ఆకులను కోసిన వెంటనే పరీక్షించితే చాలా పోషక విలువలు కలిగి ఉన్నట్లు స్పష్టమవుతుంది. పిండి పదార్థములు 60.95, మాంసకృతులు 14.37, ఖనిజ లవణాలు 14.27, నీరు 6.43, కొవ్వు పదార్థములు 3.98 గ్రామముల పోషకాలు 100 గ్రాముల తాజా తులసి ఆకుల్లో ఉంటాయి. తులసి ఆకులు ఎండిన కొద్దీ పోషక విలువలు తగ్గుతుంటాయి. కొన్ని రకాల తులసి ఆకుల్లో పీచుపదార్థాలు కూడా ఉంటాయి. కాల్షియం, సోడియం, పొటాషియం, ఇనుము, భాస్వరం లాంటి ఖనిజ లవణాలు వుంటాయి. అంతేకాకుండా విటవిన్లు కూడా తులసి ఆకుల్లో లభిస్తాయి. విటమిన్ ‘ఎ’, థీయోమిన్, రిబోప్లేవిన్, నియాసిన్, ఆస్మార్భిన్ ఆమ్లం, విటమిన్ ‘సి’, పెైరిడాక్సిన్ విటమిన్ ‘కె’లు కూడా ఉంటాయి.
16వ శతాబ్దంలోనే ఐరోపా దేశాలలో దీని పరిచయం వుందనే చారిత్రక ఆధారాలను శాస్తవ్రేత్తలు వివరిస్తున్నారు. అంతకు ముందే తులసిని మన దేశ వాసులు పూజించినట్లు పురాణ, ఇతిహాసాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా తులసికి ప్రాధాన్యత ఉందన్న సంగతి చరిత్ర చెపుతున్న సత్యం. 180 రకాల తులసి మొక్కలు న్నట్లు పరిశోధకులు అభిప్రాయ పడుతున్నారు. మన దేశంలో మాత్రం ఏడు తులసి రకాలే ఉండటం గమనించదగ్గ విషయం. 1. కృష్ణ తులసి, 2. లక్ష్మి తులసి, 3. విష్ణు తులసి, 4. అడవి తులసి, 5. రుద్ర తులసి, 6. మరువక తులసి, 7. నీల తులసి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి