6, జూన్ 2021, ఆదివారం

అణువు వ్యాప్త లక్షణమును

అణువు వ్యాప్త లక్షణమును లలితా సహస్రం చక్కగా వివరించినది. అణిమాదిభిఃఆవృతాః మయూఖైః. అణువు ఆదినుండి (భ ఈ హ) భిః మయూఖైః. భ ధాతు పరమైన పదార్దం.ఈ అనగావ మూల ప్రకృతి శక్తి. హ అనగా హవిస్సు లక్షణము అనగా అగ్ని పూర్వక వ్యాప్తి తత్వము. హవిస్సు యనగా దానికి పదార్ధాల లక్షణము కలిగియున్నది ప్రత్యక్షంగా కాదు పరోక్షంగా. అనగా కంటికి కనబడు లక్షణము లేదు. అది మన దేహములో కూడా వున్నది. లేనియెడల మనం తీసుకున్న ఆహారము హవిస్సుగా మారుట జరుగదు. అట్లు మారనియెడల దేహ వినాశనం. యీ దేహమునకు ఎలాగైతే యిటువంటి లక్షణము కలిగియున్నదో సమస్త జీవులకును ప్రకృతి ద్వారానే అటువంటి హవిస్సు లక్షణములు కూడా కలిగియున్నవి. నెమలి పురివిప్పిన నాట్యం ప్రకృతి లక్షణమును తెలుపు చున్నది. ఇదే సూత్రము అణువు కూడా ఆదినుండి అనగా మూల పకృతి చైతన్యమై ప్రకాశ వంతమై వ్యాప్తి లక్షణము కలిగినదియున్నదని వివరించుచున్నది. ప్రకాశించే తత్వము ప్రకృతి కంటికి స్పష్టంగా కనపడదు. వకవేళ కనిపించినా గుణము తెలియవలెనన్న దానిని పంచభూతాత్మకమైన శరీర రూపంలో పదార్దము వలెనే తెలియవలెను. వేరు మార్గము లేదు. యిది ప్రకృతి తత్వమైన జీవ శక్తిగా ఆత్మ శక్తిగా తెలియాలి. దేహధారణమును అన్నమాచార్యలవారు ఎంతకాలమని తెలుపుటకు కాలము అనంతమైనదని, జీవుడు అవిశ్రాంతంగా పదే పదే పుడుతూనే వుండుటను తెలిపినారు. దీనికి అంతు లేదా! అణువు కూడా అనంతమని వ్యాప్తి చెందియున్నదని దానికి కాల నిరూపణ లేనిది. సృష్టి నిరూపణ సూత్రము వ్యాప్త లక్షణము ప్రకృతి ద్వారా తెలుపుతునేయున్నది. ధర్మం నడిచినంత కాలం యీ సృష్టి నిత్యనూతనంగానే కనిపించును. అధర్మం పెరిగిన యిది లయం అగును. భూదేవికి భారం అధర్మమేగానీ మిగిలినవి భారం కాదు.ధర్మం ధారయతీ ధరిత్రీ, సృష్టి ప్రకృతి పరంగా సహజంగా వున్నంతవరకూ  ధర్మ నిరూపణయే. కాల పరిమితి దాని లక్షణము అనగా గమనం కాలమును దాని పరిమితిని దాని వ్యాప్తమును  ముందుగానే నిర్ణయింపబడి అణు స్వరూపమును ముందే ప్రకృతి ద్వారా వ్యాప్తిని తెలిపియున్నది. ప్రకృతి అమ్మ స్వరూపమని వివిధ రూప, రంగు, లక్షణములుగా సృష్టంచుటయే ప్రకృతి రూపమైన అమ్మ. అందరూ మానవులు అయితే అనందరి లక్షణములు వకే రీతిలో నుండవలెను కదా. వ్యక్తి వ్యక్తికి విలక్షణమైన ప్రకృతి భావములు కలుగుజున్నవి. సమిష్టి లక్షణములు గల ప్రకృతిని సమ పాళ్ళలో యుండుటకు ఏ జీవి తత్వం ఆజీవునిదే. ఏ జీవి ఆలోచనలు ఆజీవునివే. యిది కర్మ సిద్దాంతము, పరంపరగా వచ్చుచున్నది. ఎవరి కర్మ వారే అనుభవించవలెను.వకరి కర్మ వేరొకరు ఏరూపములోనైనా వేరొకరు అనుభవించరు. ఆత్మ అణు లక్షణము దేహము ద్వారానే సృష్టి చేయుట మాత్రమే ప్రకృతి రూపంలో అమ్మ వంతు. దానిని సవ్య ధర్మమార్గములో ప్రవర్తించుట జీవుడి వంతు. లేనిచో వినాశనం.అనంతమైన విశ్వ  ఙ్ఞానమును తెలుసుకుంటూనే వుందాం. ఆచరిస్తునే వుందాం.

కామెంట్‌లు లేవు: