*16.09.2021*
*వందేమాతరం*
*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏
*రోజుకో పద్యం: 2263(౨౨౬౩)*
*10.1-1380-వ.*
*10.1-1381-*
*క. గోపాలుఁ డొక్కఁ డద్దిర*
*భూపాలకుఁ జంపె వీనిఁ బొడువుం డేత*
*ద్రూపాలస్యము లేలని*
*తాపాలఘురోషు లగుచు దర్పోద్ధతులై.* 🌺
*_భావము: అలా శ్రీకృష్ణుడు కంసుని సంహరించిన సమయంలో, కంసుని సోదరులు రోషావేశముతో, సంతాపహృదయములతో తమ సహచరులను ప్రేరేపిస్తూ: "ఔరా! ఒక్క గొల్లపిల్లాడు మన రాజును చంపాడు. ఇక ఆలస్యం చెయ్యద్దు, వీడిని పొడవండి, చంపేయండి."_* 🙏
*_Meaning: Having witnessed this dreadful episode, the brothers of Kamsa, overwhelmed with anger and fury, incited and instigated their associates: "This young cowherd boy killed our king. Do not wait further, pounce on him and kill him."_* 🙏
*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*
*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*
*Kiran (9866661454)*
*Pavan Kumar (9347214215).*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి