అష్టైశ్వర్యాలు అంటే ఎనిమిది రకాల సంపదలని అర్ధము . ఇప్పుడు దాదాపు అందరు ఈ ఎనిమిది రకాల సంపదలలో చాలామటుకు కలిగి ఉండవచ్చు
1. దాసీజనము(పరిచారకుకు), ఇంట్లో పనిచేసే పనివాళ్ళు, అంటే మెయిడ్ సర్వెంట్ అన్న మాట. ఇంకా ధనవంతులు ఎక్కువమంది సేవకులను పెట్టుకుంటారు.
2. భృత్యులు(శిష్యులు), అంటే గృహ అవసారాలో గృహానికి సంబందించిన భాద్యతలను నిర్వహించటంలో యజమానికి సహకరించేవారు. అంటే గుమాస్తాలు అని అనవచ్చు.
3. పుత్రులు(బిడ్డలు ), తనకు కలిగిన సంతానము.
4. మిత్రులు(స్నేహితులు), దాదాపు అందరికి మిత్రులు వుంటారు కానీ మంచిమిత్రులు కలిగి ఉంటే కష్టంలో వున్నప్పుడు ఆదుకుంటారు .
5. బంధువులు(చుట్టాలు),
6. వాహనములు(కారు , మోటరు సైకిల్ , విమానము), కనీసం చిన్న మోపెడ్ అన్నా లేనివాళ్లు ఈ రోజుల్లో లేరనే అనవచ్చు.
7. ధనము(డబ్బు సంపద ), తన అవసరాలకు తగినంత దానం అంటే రాబడి కలిగి ఉండటం.
8. ధాన్యము(వస్తుసంపద) అంటే వడ్లు, జొన్నలు, మొదలైనవి అనగా మనం తినటానికి పనికి వచ్చే ఆహారపదార్ధాలు కలిగి ఉండటం. ఒకరకంగా చెప్పాలంటే తినటానికి కావలసిన వసతి.
ఈ ఎనిమిది కలిగి వున్నవారిని అష్టఐశ్వర్యవంతుడు అంటారు. అష్టదరిద్రుగూర్చి ఇంకొకసారి.
ఓం తత్సత్
ఓం శాంతి శాంతి శాంతిః
మీ
భార్గవ శర్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి