8, ఫిబ్రవరి 2022, మంగళవారం

పంచక్రియలు

 *పంచక్రియలు*



ఆధ్యాత్మిక పరమైన  జీవితాన్ని ఆదర్శవంతంగా కొనసాగించడానికి..... 'పంచక్రియలను' అనుసరించ వలసి ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి .


ఉపాసన, ఉత్సవం, అహింస, తీర్థయాత్ర, సంస్కారం అనేవి పంచక్రియలుగా చెప్పబడినాయి.


నియమ నిష్ఠలను పాటిస్తూ, సంప్రదాయాన్ని గౌరవిస్తూ, అత్యంత భక్తి శ్రద్ధలతో అనుదినం భగవంతుడిని ఆరాధించాలని 'ఉపాసన' చెబుతోంది.


చక్కని కుటుంబ వాతావరణాన్ని కలిగి వుండి, పండుగ సందర్భాల్లో జరిగే వేడుకల్లోనూ, 

దైవ సంబంధమైన ఉత్సవాల్లోనూ భక్తితో పాల్గొనాలని 'ఉత్సవం' స్పష్టం చేస్తోంది.


ఇతరులకు ఏ విధంగాను కష్టాన్ని కలిగించకుండా, ఎలాంటి కారణం చేతను వాళ్లను హింసించకుండా నడచుకోవాలని 'అహింసా' విధానం తెలియజేస్తోంది.


బరువు బాధ్యతల పేరుతో భగవంతుడిని దర్శించడం, సేవించడం మరిచిపోకూడదని చెప్పడానికే 'తీర్థయాత్రలు' ఉద్దేశించబడ్డాయి. తీర్థయాత్రలు  ప్రతి ఒక్కరి మనసుని ఎంతగానో ప్రభావితం చేస్తాయి. భగవంతుడి సన్నిధిలో గడపడం వలన కలిగే ఆనందానుభూతులు ఎలా ఉంటాయో తెలియజేస్తాయి.



పుట్టుక నుంచి మరణం వరకూ ఆచారవ్యవహారాల పేరుతో పూర్వీకుల నుంచి సంక్రమించిన పద్ధతులను పాటించడమే..


🙏

కామెంట్‌లు లేవు: