శ్లోకం:☝️
*వాసశ్చర్మ విభూషణాని ఫణినః*
*భస్మాంగరాగోధునా*
*గౌరేకః న చ కర్షణే నకుశలః*
*సంపత్తిరేతాదృశీ l*
*ఇత్యాలోచ్య విముచ్య శంకరమ్-*
*అగాత్ రత్నాకరం జాహ్నవీ*
*వ్యర్థం నిర్ధనికస్య జీవనమ్-*
*అహో! దారైరపి త్యజ్యతే ll*
భావం: ధరించేది చర్మం, ఆభరణాలేమో సర్పాలు,
అంగరాగము (శరీరమంతటా) చితాభస్మము,
ఉన్నది దున్నుటకు ఉపయోగపడని ఒకే ఒక్క ఎద్దు.
ఇవి ఈయన గారి ఐశ్వర్యం - అని ఆలోచించి గంగాదేవి శంకరుని విడచి రత్నాకరుని (సముద్రుని) చేరింది- ఆహా! ధనహీనుని జీవితమెంత వ్యర్థము? చివరికి భార్యకూడా విడిచి పెడుతుంది కదా! అని ఒక కవీశ్వరుని చమత్కారం.🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి