27, ఆగస్టు 2022, శనివారం

ప్రసాదం

 🎻🌹🙏స్వామివారి ప్రసాదం-ప్రత్యేకత....


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


అన్నవరం శ్రీ సత్యనారాయణ  స్వామివారి ప్రసాదం చాలా ప్రత్యేకంగా తయారుచేస్తారు. 


గోధుమనూక, నెయ్యి, పంచదారతో తయారుచేసే ఆ ప్రసాదానికి అలయ ప్రసాద రుచి మన ఇంటిలో చేస్తే రానేరాదు. 


ఆ రుచికి కారణం స్వామివారి మహిమే. స్వామివారి ప్రసాదం ఫలప్రదం అగుటకు ఎన్నో ఉదాహరణలు చెప్తారు.


 స్వామివారి వ్రతం చేసుకున్న తరువాత మర్చిపోకుండా తీర్థ ప్రసాదాలు తీసుకోవలెను. 


అన్నవరం ప్రసాదాన్ని ఎర్ర గోధుమనూక, ఆవు నెయ్యి, పంచదార, యాలకులపొడితో తయారుచేస్తారు.


ఈ ప్రసాదం సుగంధభరితంగా ఉంటుంది. చిన్నపాటి ఎండిన విస్తరాకులో ఈ ప్రసాదాన్ని పెట్టి అందిస్తూ ఉంటారు.


దూరప్రాంతాలకు తీసుకువెళ్ళేందుకు వీలుగా గోధుమ రవ్వతో బంగి ప్రసాదంగానూ (గట్టి ప్రసాదం) తయారుచేస్తూంటారు.


అయితే, భక్తులు బంగి ప్రసాదం కన్నా రవ్వ ప్రసాదాన్నే ఎక్కువ ఇష్టపడతారు.


ప్రసాదాన్ని తయారుచేసే భవనానికి భూతాది అని పేరు. వంటవారు తెల్లవారుజామున 3 గంటలకు పని ప్రారంభించి తయారుచేస్తారు. ఒక్కో తయారీ యూనిట్‌లో 68 మంది సిబ్బందితో 20 కళాయిల్లో ఈ ప్రసాదం తయారీచేస్తూ ఉంటారు. 


సాధారణ రోజుల్లో మొత్తం 100 కళాయిల్లో ప్రసాదాలు తయారుచేస్తారు. రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో 250 కళాయిలతో పనిచేస్తారు. గోదావరి పుష్కరాల సమయంలో రోజుకు 270 కళాయిలతో పనిచేసింది రికార్డు అని వంట బృందానికి నేతృత్వం వహించే మధుబాబు చెప్పారు.


 ఒక్కో కళాయికి 80 కేజీల ప్రసాదం తయారవుతుంది. 15 కేజీల గోధుమ నూక, 30 కేజీల పంచదార, 6 కేజీల ఆవునెయ్యి, 5 కేజీల యాలకుల పొడి ఉపయోగిస్తారు. నీళ్ళు వేసి బాగా మరిగించి, అందులో మొదట గోధుమ నూక, తర్వాత పంచదార వేస్తారు. 


ఆ మిశ్రమం రంగుమారేదాకా ఉడికించి ఆవునెయ్యి కలుపుతారు. చివరిలో యాలకుల పొడి ప్రసాదంపై చల్లుతారు.


2021 ఆగస్టులో దాతల సహకారంతో ఈ ప్రక్రియలో కొంత భాగాన్ని చేసేందుకు దేవస్థానం యంత్రాలను ప్రవేశపెట్టింది. మూడు వేర్వేరు గొట్టాల ద్వారా వేడి నీరు, గోధుమ నూక, రెండు విడతలుగా పంచదార కళాయిలో పడేలా ఈ యంత్రంలో ఏర్పాటుచేస్తుంది.


 ఉడికిన తర్వాత నెయ్యి కలిపి, యాలకుల పొడి చల్లడం వంటవారు చేయాల్సి ఉంటుంది. కళాయికి రెండువైపులా ఉన్న చక్రాలను తిప్పితే పూర్తైన ప్రసాదం ప్యాకింగ్ కోసం తీసుకువెళ్ళేందుకు మరో తొట్టిలో పడుంతుంది. 


45 నిమిషాల్లో కళాయి ప్రసాదాన్ని వండేందుకు ఈ కొత్త ప్రక్రియ వీలు కల్పిస్తోంది. అలా స్వామివారి ప్రసాదం స్వామి నుండి మన చెంతకు వస్తుంది..🚩🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

కామెంట్‌లు లేవు: