✡️ మలిగిన శ్రావణం ✡️
సీ॥
సిగపూల ముచ్చట్ల చిద్విలాసము ముగిసె
మైపూత ఘుమఘుమల్ మాటు చెందె
పసిడిచీరలు దాగె భవ్యభూషలుం దాగె
చిఱుజల్లులన్ గాచు చెంగు లొదుగ
పసుపు నిండిన మేలి పాదాల సవ్వడి
మార్గాల నినదింప మరచి పోయె
ఇంటింట పేరంట మింపు సేయగ మానె
బడలెనో శనగల వాయనాలు
గీ॥
శ్రీల రూపమై నడయాడు శ్రీమతు లిల
శ్రావణార్భటి తోడ సై యనంగ
సందడించిన శ్రావణ సన్నుతాంగి
మెల్లగా చనుదెంచె నీ మేది నుండి
*~శ్రీశర్మద*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి