పొలాల అమావాస్య విశిష్టత ఇదే !
శ్రావణమాసం.. పూర్తవుతుంది. అమావాస్య ఈ రోజునే పొలాల అమావాస్య అంటారు. ఈరోజు పలుప్రాంతాలలో అనేక రకాలుగా వ్రతం, పూజలు చేస్తారు. ఈ పండుగ విశేషాలు తెలుసుకుందాం..
పొలాల అమావాస్య ఎందుకు చేసుకొంటారు? ఇది ఎలా చెయ్యాలి..?
శ్రావణ అమావాస్య
శ్రావణ బహుళ అమావాస్య రోజును పోలాల అమావాస్య అని అంటారు. ఈ పండగ కు కందమొక్క, బచ్చలి మొక్కకు పూజ చేస్తారు. పూజలో ఒక కథ కూడా చెప్తారు. ఇది పెళ్ళయిన ఆడవాళ్ళుపిల్లల కలవారు వారి శ్రేయస్సు కోసం చేస్తారు. పిల్లలు లేనివారు పిల్లలు కలగటానికి ఈ పూజ చేస్తారు. ఈ పూజలో ఆడపిల్లు కావాలనుకునేవారు గారెలు దండ అమ్మవారికి వేస్తామని, మొగపిల్లలు కావలి అనే కోరిక కలవారు పూర్ణం బూరెలు దండ అమ్మవారికి వేస్తామని మొక్కుకుంటారుట. ఈ పోలేరమ్మకు గౌరీదేవి పూజ చేస్తారు. నివేదనగా నవకాయ కూర చేస్తారు, ఇంకా పప్పు తాలికలు, పాలతాలికలు, మినపకుడుములు చేసి అమ్మవారికి నివేదిస్తారు.
వ్యవసాయదారులు గోవులను పాలించువారు తమ ఆవులు ఎద్దులకు ఈ రోజున విశేష పూజలు నిర్వహించడం ఆనవాయితీ. గ్రామాల్లో ఆవులు ఎద్దులకు కడుపునిండా తిండి నీరు తాగించి ఎలాంటి పనులు చేయించకుండా బాగా మేపే అమావాస్యగా పెద్దలు చెబుతారు. భారతీయ సంస్కృతిలో ఆవులు ఎద్దులను పూజించడం సాంప్రదాయంగా వస్తుంది. అలాంటి సాంప్రదాయాలను నేటికీ గ్రామాల్లో పొలాల అమావాస్య పండుగగా జరుపుకుంటారు. పార్వతీదేవి విషయమై నంది తనకు చేసిన సాహసాన్ని మెచ్చి శివుడు శ్రావణ బహుళ అమావాస్య రోజున వృషభాన్ని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని అనుగ్రహించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఏరువాక పున్నమి (జ్యేష్ఠ పున్నమి) మొదలు శ్రావణమాసం వరకు వ్యవసాయ పనులతో ఎద్దులకు తీరికలేకుండా పని ఉంటుంది. శ్రావణమాసానికి విశ్రాంతి దొరుకుతుం ది. ఈరోజు వ్యవసాయానికి సంబంధించిన ఏ పనీ చేయకుండా పూజ మాత్రమే జరపడం సాంప్రదాయంగా వస్తుంది.
– శ్రీ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి