🙏జి వి రామయ్య. అనంతపురం
తగులబడిన తాడుపై పూర్వపు ఆకారం ఉన్నా అది దేనినీ బంధించడానికి ఏ విధంగా అయితే పనికిరాదో అదేవిధంగా జ్ఞానాగ్నిచే దగ్ధమైన అహంకారం కూడ కర్మబంధాన్ని కలిగించే శక్తి లేనిదై ఉంటుంది.*
వాదించే వారికి నువ్వెంత తక్కువగా స్పందిస్తే అంత ప్రశాంతంగా ఉండగలుగుతావు.*
----------------------------------------------------------
శ్లో|| కృతశతమసత్సు నష్టం సుభాషితశతం చ నష్టమబుధేషు |
వచనశతమవచనకరే బుద్ధిశతమచేతనే నష్టమ్ ||
తా|| సత్పురుషులు కానివారికి నూరు మంచిపనులు చేసిననూ వ్యర్థమే. బుద్ధిలేని వారికి నూరు సుభాషితములు చెప్పిననూ వ్యర్థమే. చెప్పినట్లు చేయనివారికి నూరుమాటలు చెప్పిననూ వ్యర్థమే. మూర్ఖులకు నూరు మంచిమాటలు చెప్పిననూ వ్యర్థమే.🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి