18, నవంబర్ 2022, శుక్రవారం

సర్వజ్ఞత్వం

 సర్వజ్ఞత్వం....

కలకత్తా లో ఉన్న పరమాచార్య వారి భక్తుడైన ముఖర్జీ చెన్నై లో ఉన్న తన మిత్రునికి ఆత్మనాధన్ కి 24 దానిమ్మ పళ్ళు పంపుతూ వాటిని కంచిలో గల మహాస్వామి వారికి చేర్చమని కోరాడు. ఆత్మనాధన్ పని వత్తిడి వల్ల తన స్నేహితునితో

"వీటిని కంచి స్వామి వారికి చేర్చగలవా "అని అడిగాడు. ఆ మిత్రుడు అందుకు అంగీకరిస్తూ

"ఆత్మనాధన్! దానిమ్మ పళ్ళు అద్భుతంగా ఉన్నాయి. నేను రెండు తీసుకొని మిగతావాటిని చేరుస్తాను."

ఆత్మనాధన్ "వద్దు. అలా చేయడం తప్పు.నువ్వు పండ్లు తీసికొన్న విషయం స్వామి వారికీ తెలిసి పోతుంది."

మిత్రుడు "అదెలా సాధ్యం.స్వామి ముఖర్జీ కి జాబు వ్రాసి ఎన్ని పండ్లు నాకు పంపావు అని అడగరు కదా.అంతే గాక ఆయనకు భక్తులు ఎన్నో పండ్లు తెచ్చిస్తారు. వాటితో ఇవి కలిసిపోతాయి."అని నాలుగు పండ్లు తీసికొని మిగతావి మఠం లో చేర్చాడు.

ఆ పండ్ల వైపు చూస్తూ

స్వామి అక్కడి సిబ్బందితో "ముఖర్జీ కి జాబు వ్రాయమని మేనేజర్ కి చెప్పు. అతను పంపిన దానిమ్మ పండ్లలో 20మాత్రం మఠం చేరాయని."అన్నారు. క్రీగంట అతని మిత్రునికేసి చూస్తూ.

ఆత్మనాధన్ మిత్రుని ముఖం అపరాధ భావనతో మాడిపోయింది. "

***మహా స్వామి వారి సర్వజ్ఞత్వం నిరూపించే సంఘటనలు కోకొల్లలు గా జరిగేవి. వాటిలో కొన్ని....ఈశ్వరుణ్ణి మనం మాయ చేయగలమా ***

కామెంట్‌లు లేవు: