12, డిసెంబర్ 2022, సోమవారం

*శ్రీ శారదాదేవి జీవిత విశేషాలు:34*

 ఆత్మ విద్య మీ జన్మ రహస్యం- / ఆత్మ-మీ సొంత ఇల్లు, మీ శరీరం అద్దె ఇల్లు. ఆత్మ విద్య:

*శ్రీ శారదాదేవి జీవిత విశేషాలు:34* 


       *శారదాదేవికి శ్రీరామకృష్ణులే*

               *గురువు కావడం:* 

                  ➖➖➖


పారమార్థిక (ఆధ్యాత్మిక) ఉపదేశాలను, సలహాలను అప్పుడప్పుడు ఇవ్వడంతోపాటు *గురుదేవులు శారదాదేవికి మంత్రోపదేశం చేసి, జపం, ధ్యానం ఇత్యాదులలో శిక్షణ కూడా ఇచ్చారు.* 

 

శారదాదేవి కామార్పుకూరులో ఉంటున్నప్పుడు పూర్ణానందుడనే సన్న్యాసి ఆమెకు శక్తి మంత్రదీక్ష ఇచ్చాడు. *గురుదేవులు మళ్లీ ఆమెకు శక్తి మంత్రదీక్షను ప్రసాదిస్తూ, బీజ మంత్రాన్ని ఆమె నాలుకపై వ్రాశారు.* మంత్రజపమనేది శారద నిత్యజీవితంలో కలిసిపోయిన సాధన పద్ధతిగా ఒప్పారింది. గురుదేవులకూ, ఆయన భక్తులకు రోజంతా చేయవలసిన సేవల నడుమ చాలాసేపు ఆమె జపంలోనూ, ధ్యానంలోనూ గడిపేది. 


ఒకసారి తన తమ్ముడి కుమార్తె నళినితో, "నీ వయస్కురాలినై ఉన్నప్పుడు, రోజంతా ఎన్ని పనులు చేసే దాన్నో తెలుసా? అప్పటికీ *ప్రతి రోజూ ఒక లక్ష జపం చేయడానికి సమయాన్ని కేటాయించుకొనేదాన్ని"* అంటూ కాలాంతరంలో చెప్పేవారు.


ఉన్నతమైన దివ్య పారవశ్యస్థితి నుంచి మామూలు బాహ్యస్థితికి వచ్చేటప్పుడు గురుదేవులు కొన్ని సమయాల్లో పరాశక్తి భావంలో లీనమై ఉండేవారు. ఆ సమయాల్లో తమను దేవి సేవకురాలిగా భావించేవారు. అంతేకాకుండా, శారదను ఇతరులను కూడా అలాగే చూసేవారు. అప్పుడు శారదాదేవి ఆయనను స్త్రీగా అలంకరించేది. తర్వాత తనను కూడా దేవి సేవకురాలిగా భావించుకునేది.


 *రాజయోగంలో కూడా ఆమెకు తర్ఫీదు నిచ్చారు. గురుదేవులు, మానవ శరీరంలోని చక్రాలనూ, కుండలినీ శక్తి మొదలైన వాటిని చిత్రాలుగా గీచి ఆమెకు వివరించేవారు.* 


భగవంతుని అనుభూతి ఒక్కటే, ఆమెకు లక్ష్యంగా ఉండాలి. రోగాలు నయం చేయడం లాంటి సిద్ధుల వెంట ఆమె మనస్సు వెళ్లకూడదని ఎంతో జాగ్రత్త వహించారు. గురుదేవులు. రోగాలు నయం చేసే ఒక మంత్రాన్ని ఆమె అప్పటికే నేర్చుకొంది. దక్షిణేశ్వరం వచ్చిన తర్వాత ఈ విషయం గురుదేవులతో చెప్పింది. అందుకు గురుదేవులు, "ఫరవాలేదు. నేర్చుకోవడంలో తప్పు లేదు. ఇక దానిని నీ ఇష్టదైవం పాదాల మ్రోల సమర్పించేయి" అన్నారు. ఈ కాలఘట్టంలోనే పలుదేవతా మంత్రాలనూ, వాటిని ఇతరులకు ఇవ్వవలసిన విధానాన్ని గురుదేవులు శారదకు నేర్పించారు.✍️

రేపు…35వ భాగము…

                  *శ్రీ మాత్రే నమః*

.                      🌷🙏🌷


🕉🕉🕉    * 🕉🕉🕉


               🙏🏼 *సత్యం తెలుసుకుంటే మనం చేసే సంకల్పాలన్నీ మనవి కాదని అర్థం అవుతుంది. అన్నం ముద్ద గొంతు దిగేవరకు మనకు తెలుస్తుంది. అప్పటివరకు మన ప్రతిభ అనుకుంటాం. తర్వాత జీర్ణం అవ్వడంలో మన సంకల్పం ఎంత ఉంది? అని ఆలోచిస్తే అహంకారం పతనమవుతుంది. ఒక విత్తనం నాటడం మన సంకల్పమైతే, దాని నుండి వేల ఫలాలు వెలువడడం మన సంకల్పం కాదుకదా?*


       *ఈశ్వరుడి సంకల్పశక్తిని మనం ఆపాదించుకోవడం అహంకారమే అవుతుంది*


               *మనది కేవలం గమనించే లక్షణం మాత్రమే. భగవదనుగ్రహంలో  ఏనాడు పక్షపాతం ఉండదు. యోగాయోగ్యత కలిగినవారికి తదనుగుణమైన ఫలితం లభిస్తుంది. ఈ ప్రపంచం పట్ల మనకున్న వ్యామోహాన్ని విసర్జించి అభ్యాసం ద్వారా దైవాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడమే చేయవలసిన కర్తవ్యం. మనస్సు పరిశుద్ధం కాకుంటే ఆత్మ దర్శనం, దైవ దర్శనం అసాధ్యం!* 🙏🏼


🕉✡✡🕉☸☸🕉⚛⚛🕉

కామెంట్‌లు లేవు: