🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*
. ♦️ *ఆర్య చాణక్య*♦️
*పార్ట్ - 131*
🔴 *రాజనీతి సూత్రాణి - అష్టమాధ్యాయము* :
1. దుర్మేధసో సచ్చాస్త్రం మోహయతి
(మంచిశాస్త్రం మేధాశక్తి లేనివాళ్ళకి భ్రాంతి కలిగిస్తుంది.)
2. సత్సజ్గ స్వర్గవాస
(సత్పురుషసంగమే స్వర్గవాసం.)
3. ఆర్యా స్వమివ పరం మన్యంతే
(సత్పురుషులు పరాయివాడిని కూడా తనవాడిలా భావిస్తారు.)
4. రూపానువర్తీ గుణ
(రూపాన్ని అనుసరించి గుణం ఉంటుంది.)
5. యత్ర సుఖేన వర్తతే తదేవ స్థానమ్
(ఎక్కడ సుఖంగా నివసించగలుగుతాడో అదే సరైన స్థానం.)
6. విశ్వాసఘాతినో న నిష్కృతి
(విశ్వాసఘాతకుడికి ప్రాయశ్చిత్తం లేదు.)
7. దైవాయత్తం న శోచేత్
(దైవధీనమైనదానిని గూర్చి విచారించకూడదు.)
8. ఆశ్రితదుఃఖమాత్మన ఇవ మన్యతే సాధుః (సత్పురుషుడు తన ఆశ్రితులకు కలిగిన దుఃఖాన్ని తన దుఃఖం వలె భావిస్తాడు.)
9. హృద్గతమాచ్చాద్యాన్యద్వత్యనార్యః
(మనసులో ఉన్నది దాచుకొని పైకి మరొకటి చెబుతాడు.)
10. బుద్ధిహీన పిశాచతుల్య
(బుద్ధిలేనివాడు పిశాచం వంటివాడు.)
11. అసహాయః పథి న గచ్చేత్
(తోడు లేకుండా దూరప్రయాణాలు చేయకూడదు.)
12. పుత్రో న స్తోతవ్య
(పుత్రుడ్ని స్తుతించకూడదు.)
13. స్వామీ స్తోతవ్యో - నుజీవిభిః
(ఆశ్రయించి బ్రతికేవాళ్ళు ప్రభువును స్తుతిస్తూ ఉండాలి.)
14. ధర్మకృత్యాని సర్వాణి స్వామిన ఇత్యేవ ఘోషయేత్
(ధర్మబద్ధంగా జరుగుతున్న పనులన్నీ ప్రభువుగారివే అని చాటిచెబుతుండాలి.)
15. రాజాజ్ఞాం నాతిలజ్జయేత్
(రాజాజ్ఞ దాటకూడదు.)
16. యథా జ్ఞప్తం తథా కుర్యాత్
(ఎలా ఆజ్ఞాపిస్తే అలా చెయ్యాలి.)
17. నాస్తి బుద్ధిమతాం శత్రుః
(బుద్ధిమంతులకు శత్రువు ఉండడు.)
18. ఆత్మచ్చిద్రం న ప్రకాశయేత్
(తన లోపాల్ని బయటికి తెలియనీయకూడదు.)
19. క్షమావానేవ సర్వం సాధయతి
(ఓర్పుగలవాడే అన్నీ సాధించగలుగుతాడు.)
20. ఆపదర్థం ధనం రక్షేత్
(ఆపత్కాలంలో ఉపయోగపడడానికి ధనం జాగ్రత్తపెట్టుకోవాలి.)
21. సాహసవతాం ప్రియం కర్తవ్యమ్ (సాహసవంతులకు పని సాధించడం అంటే చాలా ఇష్టం.)
22. శ్వ కార్యమద్య కుర్వీత
(రేపు చేయవలసిన పని నేడే చెయ్యాలి.)
23. అపర్హ్నికం పూర్వాహ్న ఏవ కర్తవ్యమ్ (మధ్యాహ్నం తర్వాత చేయవలసింది ప్రొద్దుటే చేయాలి.)
24. వ్యవహారానులోమో ధర్మః
(లోకవ్యవహారానికి అనుకూలంగా ఉండేదే ధర్మం.)
25. సర్వజ్ఞతా లోకజ్ఞతా
(లోకజ్ఞానం బాగా ఉండటమే సర్వజ్ఞత్వం.)
26. శాస్త్రజో ప్యలోకజ్ఞో మూర్ఖతుల్య (శాస్త్రపండితులైన లోకజ్ఞానం లేనివాడు మూర్ఖుడు వంటివాడు.)
27. శాస్త్రప్రయోజనం తత్వదర్శనమ్
(యధార్థస్థితిని తెలుసుకోవడమే శాస్త్రానికి ప్రయోజనం.)
28. తత్వజ్ఞానం కార్యమేవ ప్రకాశయతి
(ఒకడికి ఎంత తత్వజ్ఞానం ఉందో అతడు చేసే కార్యమే చెబుతుంది.)
29. వ్యవహారే పక్షపాతో న కార్య
(వ్యవహారంలో పక్షపాతం చూపకూడదు.)
30. ధర్మాదపి వ్యవహారో గరీయాన్
(ధర్మం కంటే కూడా వ్యవహారం గొప్పది.)
31. ఆత్మా హి వ్యవహారస్య సాక్షీ
(వ్యవహారంలో అంతరాత్మయే సాక్షి.)
32. సర్వసాక్షీ హాత్మా
(అంతరాత్మ అందరికీ సాక్షి కదా.)
33. న స్యాత్ కూటసాక్షీ
(అసత్యమైన సాక్ష్యం చెప్పేవాడు కాకూడదు.)
34. కూటసాక్షిణో నరకే పతంతి
(కూటసాక్షులు నరకంలో పడతారు.)
35. ప్రచ్చపాపానాం సాక్షిణో భూతాని
(రహస్యంగా పాపాలు చేసినవాళ్ళకి పంచమహాభూతాలే సాక్షులు.)
36. ఆత్మనః పాపయాత్మైవ ప్రకాశయతి
(ఎప్పుడో ఒకప్పుడు తన పాపాన్ని తానే బయట పెట్టుకుంటాడు.)
37. వ్యవహారే నర్గతమాకారః సూచయతి (వ్యవహారం లోపల ఉన్న భావాన్ని ఆకారమే సూచిస్తుంది.)
38. ఆకారసంవరణం దేవానామప్యశక్యమ్ (దేవతలు కూడా ఆకారం కప్పిపుచ్చుకొనలేరు.)
39. చోరరాజపురుషేభ్యో విత్తం రక్షేత్
(దొంగలనుండి అధికారులనుండి ధనం రక్షించుకోవాలి.)
40. దుర్ధర్శనా హి రాజానః ప్రజా రక్షంతి (వచ్చినవాళ్ళకి దర్శనం ఇవ్వని రాజులు ప్రజల్ని నశింపచేస్తారు.)
41. సుదర్శనా రాజనః ప్రజా రక్షంతి
(సులభంగా దర్శనమిచ్చే రాజులు ప్రజల్ని రక్షిస్తారు.)
42. న్యాయయుక్తం రాజానం మాతరం మన్యంతే ప్రజాః
(న్యాయంగా ఉండే రాజును ప్రజలు తల్లిగా భావిస్తారు.)
43. తాదృశః స రాజా ఇహ సుఖం తతః స్వర్గం ప్రాప్నోతి
(అలాంటి రాజు ఇహలోకంలో సుఖం పొందుతాడు. తర్వాత స్వర్గం పొందుతాడు.)
44. అహింసాలక్షణో ధర్మః
(ఎవరినీ హింసించకపోవడమే ధర్మానికి లక్షణం.)
45. స్వశరీరమపి పరశరీరం మన్యతే సాధుః (సత్పురుషుడు తన శరీరాన్ని పరోపకారం కోసం ఉపయోగించవలసినదానినిగా భావిస్తాడు.)
46. మాంసభక్షణమయుక్తం సర్వేషామ్
(అందరికీ కూడా మాంసభక్షణం అయుక్తమైనది.)
47. న సంసారభయం జ్ఞానవతామ్
(తత్వజ్ఞానం ఉన్నవాళ్ళకి సంసారం వల్ల భయం ఉండదు.)
48. విజ్ఞానదీపేన సంసారభయం నివర్తయతి (తత్వజ్ఞానం అనే దీపంచేత సంసారభయం తొలగించుకుంటాడు.)
49. సర్వమనిత్యం భవతి
(ప్రతీదీ అనిత్యమే.)
50. కృమిశకృన్మూత్రభాజనం శరీరం పుణ్యపాపజన్మహేతుః
(క్రిములూ, మలమూ, మూత్రమూ - వీటికి స్థానమైన ఈ శరీరం పుణ్యం చేయడానికైనా పాపం చేయడానికైనా సాధనం.)
51. జన్మమరణాదిషు తు దుఃఖమేవ
(జన్మ, మరణాలలో దుఃఖమే కానీ సుఖం లేదు.)
52. తపసా స్వర్గమాప్నోతి
(తపస్సుచేత స్వర్గం పొందుతాడు.)
53. క్షమాయుక్తస్య తపో వివర్థతే
(ఓర్పు ఉన్నవారి తపస్సు పెరుగుతుంది.)
54. తస్మాత్ సర్వేషాం సర్వకార్యసిద్ధిర్భవతి (తపస్సు వల్ల అందరికీ అన్ని కార్యాలూ సిద్ధిస్తాయి.)
(ఇంకా ఉంది)...🙏
సేకరణ:- శ్రీ కె.వి. రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.
🎄🌲🪻🎄🌲🪻🎄🌲🪻🎄
👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి