**
(ప్రహేళిక=పజిల్)
ఈ క్రింది పద్యాన్ని చదివి అర్థంచేసుకొని సరైన సమాధానమివ్వాలి.
卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐
*జనకపుత్రియు విభుడు*
*దర్శన మొసంగు*
*****************
(చిత్రకవిత) సీ౹౹ శ్రీవరుండగుటచేఁ గృష్ణు నేపతి యండ్రు?
శ్రీనాథు పద్యాల శ్రేష్టమేది?
ఋషియాజ్ఞచే రాముడే రాక్షసిన్ జంపె?
బాపుజీ దేనిపై వడకె నూలు?
వైకుంఠునకు నేది ప్రధమావతారమ్ము?
పద్యగద్యమయ కావ్యవిధమేది?
వ్యాకరణోక్త "న" వర్ణము పేరేమి?
లోభినే మందురు లోకమందు?
తే.గీ౹౹అన్నిటకిఁ గూడ మూడేసి అక్షరాలె
ఆది వర్ణముల్ వరుసగా నమరఁ జేయ
జనకపుత్రియు విభుడు దర్శనమొసంగి
చెప్ప గలిగిన వారి నాశీర్వదించు .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి