చామకూర కవితా చమత్కారం!
" తనకుం గౌగిలి యీవొకప్పుడును నాథా ! నీకర స్పర్శనం
బున గిల్గింతలె యంచుఁ బద్మిని కరాంభోజంబునన్ మంద మం
ద నటద్వాయు చలద్దళాంగుళులు కన్పట్టంగ నవ్వెల్గు రా
యని రా రా యని పిల్చెనాఁదగె , ద్విరేఫాద్యంత దీర్ఘధ్వనుల్".
చామకూర వేంకట కవి: విజయ విలాసము- 1 ఆ: 139 పద్యం!
పెక్కు కావ్యాలు వ్రాయక పోయినా ,ప్రతిభా వంతుడై ప్రతిపద్య చమత్కార భాసురమైన "విజయ విలాస ప్రబంధంతో ప్రబంధకవుల కగ్రస్థానంలోనిలచిన వేంకటకవి బహుధాప్రశంసనీయుడు. విజయ విలాసమునకు "పిల్లవసుచరిత్రమను"-
ఖ్యాతి దక్కినదన చామకూర కృషియెంతటిదో మనమూహింప వచ్చును.
వసు చరిత్రములోని చమత్కారములకు శ్లేషలకు ,విజయ విలాసమునందలి చమత్కారములకు బహుధాభేదమున్నది.
వసుచరిత్ర శ్లేషలు పండిత సహాయములేనిదే బోధపడవు. విజయ విలాసము నందలిశ్లేషలు చిరుచిరు అచ్చతెనుగు పదముల ముచ్చటలై సందెగాలికి విచ్చుకొను బొండుమల్లలవలె చదివినంతమాత్రముననే బోధపడి పాఠకుల నలరించును. ఇక అసలు విషయమును పరిశీలింతుముగాక!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి