11, నవంబర్ 2023, శనివారం

ధన్వంతరి జయంతి..!!

 🙏నేడు ధన్వంతరి జయంతి..!!


🌿ధన్వంతరి నారాయణాంశ సంభూతుడు. మానవజాతికి చికిత్సా విధానాన్ని అనుగ్రహించిన ఆదివైద్యుడు. 


🌸శ్రీభాగవతం సహా వివిధ పురాణాల్లో ధన్వంతరి ప్రస్తావన ఉంది. అనేక ప్రాంతాల్లో ఆ ఆరోగ్యప్రదాతకు గుడికట్టి పూజిస్తున్నారు. అందులో ఒకటి తెలుగు నేల మీదా ఉంది.


🌷జన్మవృత్తం🌷


🌿ఒకవైపు దేవతలూ మరోవైపు రాక్షసులూ - క్షీరసాగర మథనం జరుగుతోంది. కల్పవృక్షం, కామధేనువు, లక్ష్మీదేవి, ఆ వరుసలో పదకొండవవాడిగా పాలకడలిలోంచి స్ఫురద్రూపి అయిన ఓ పురుషుడు ఉద్భవించారు.


🌸పెద్దపెద్ద కళ్లూ, ఒత్తయిన కేశాలూ, అంతెత్తు ఆకారం, చిరుదరహాసం తో ఉన్న ఆ రూపాన్ని ముక్కోటి దేవతలూ రెప్పవాల్చకుండా చూశారు.


🌿అతను పీతాంబరాన్ని కట్టుకున్నాడు, మణికుండలాలు ధరించాడు, మెడలో దివ్యమాల మెరిసిపోతోంది. ఓ చేతిలో అమృతభాండం ఉంది.


🌸మరో చేతిలో వనమూలికలున్నాయి. అచ్చంగా శ్రీమన్నారాయణుడిలా ఉన్నాడు - కాదుకాదు, సాక్షాత్తూ నారాయణుడి అంశే! బ్రహ్మాదులు అతనికి "ధన్వంతరి" అని నామకరణం చేశారు.


🌿ధన్వంతరి అంటే మనసుకు పట్టిన జాడ్యాల్నీ, శరీరానికి ముసురుకున్న వ్యాధుల్నీ తొలగించేవాడని అర్థం. పురాణాల ప్రకారం ధన్వంతరి ఆరోగ్యానికి అధిపతి. 


🌸పరిపూర్ణ ఆయువు కోసం ఘనంగా ధన్వంతరీ వ్రతం చేయడం ప్రాచీన సంప్రదాయం. ధనత్రయోదశినాడు లక్ష్మీదేవితో పాటూ ధన్వంతరినీ పూజిస్తారు. 


🌿ఏటా ధన్వంతరి జయంతిని సముద్ర తీరంలోనో స్వగృహంలోనో వైద్యశాలలోనో కలశాన్ని స్థాపించి పురాణాంతర్గతమైన ధన్వంతరి మహామంత్రాన్ని పఠించి  వైద్యులకూ సంపూర్ణ ఆరోగ్యవంతులకూ తాంబూలాలు ఇచ్చి ఆశీస్సులు తీసుకుంటారు. పెసర పులగాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం సంప్రదాయం.


🌷పురాణ గాథలు…🌷


🌸ఓసారి, దుర్వాస మహాముని శాపం కారణంగా ముక్కోటి దేవతలూ అనారోగ్యంతో బాధపడుతున్న పరిస్థితి లో ధన్వంతరి అరుదైన వనమూలికలతో చికిత్సలు చేసి అమరుల్ని ఆరోగ్యవంతుల్ని చేశాడని ఐతిహ్యం.


🌿ధన్వంతరి ప్రస్తావన ఒక్కో పురాణంలో ఒక్కోలా కనిపిస్తుంది. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం ధన్వంతరి సూర్యనారాయణుడి ప్రియశిష్యుడు. ఆయన దగ్గరే ఆయుర్వేదం నేర్చుకున్నాడు. 


🌸విష్ణుమూర్తి ఆదేశం ప్రకారం ద్వితీయ ద్వాపర యుగంలో కాశీ రాజ్యాన్ని పాలించిన చంద్రవంశ రాజు ధన్వనృపాలుడి కొడుకుగా అవతరించిన ధన్వంతరి ఆయుర్వేదాన్ని శాస్త్రంగా మలిచి శుశ్రుతుడితో సహా ఎంతోమందికి బోధించాడనీ అనేక సంవత్సరాల పాలన తర్వాత తిరిగి దైవత్వాన్ని పొందాడనీ పురాణాలు పేర్కొంటున్నాయి.


🌿ఆయుర్వేద వైద్యులకు ధన్వంతరే తొలిదైవం. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ధన్వంతరి ఆలయాలున్నాయి. అందులో ఒకటి తెలుగు గడ్డమీదా ఉంది.


🌷చింతలూరులో - ధన్వంతరి స్వామి ఆలయం..🌷


🌸తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలంలోని చింతలూరు గ్రామంలో ధన్వంతరి స్వామి ఆలయం ఉంది. గౌతమీ తీరాన, పచ్చని పంటపొలాల మధ్య, సుమారు రెండెకరాల సువిశాల ఆవరణలో స్వామివారు కొలువుదీరి ఉన్నారు.


🌿ఆలయంలో అడుగు పెట్టినంత మాత్రానే సమస్త రోగాలూ నయమైపోతాయని భక్తుల నమ్మకం. ఆలయ ప్రాంగణంలో ఎత్తయిన ధ్వజస్తంభం కనిపిస్తుంది. 


🌸విశాలమైన ముఖ మండపం ఉంది. గర్భాలయంలో ధన్వంతరి దివ్య మంగళరూపం దేదీప్యమానంగా దర్శనమిస్తుంది. కాశీలో ఏకశిలతో మలచిన పాలరాతి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు.


🌿నాలుగు హస్తాలతో ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో చక్రం, ఒక చేతిలో అమృతకలశం, ఒక చేతిలో జలగతో స్వామి దర్శనమిస్తాడు. ప్రాచీన ఆయుర్వేదంలో జలగ చికిత్స ఓ భాగం. 


🌸చెడురక్తాన్ని పీల్చుకునే శక్తి ఉందా జీవికి. చింతలూరు వెంకటేశ్వర ఆయుర్వేద నిలయం వ్యవస్థాపకులు ద్విభాష్యం వెంకటేశ్వర్లు 1942లో ఈ ఆలయాన్ని నిర్మించారు.


🌿పూజాదికాలకు ఏ లోటూ లేకుండా శాశ్వత ప్రాతిపదికన గ్రామంలోనే పద్దెనిమిది ఎకరాల భూమిని కేటాయించారు. ఆయన వంశీకులైన ద్విభాష్యం వెంకట శ్రీరామమూర్తి చలువరాతితో సర్వాంగ సుందరంగా ఆలయాన్ని తీర్చిదిద్దారు. 


🌸ఈ గుడి రాజమండ్రి నుంచి 35 కిలో మీటర్లు దూరంలో ఉంది. ఏటా కార్తిక బహుళ త్రయోదశినాడు ధన్వంతరి జయంతిని వైభవంగా నిర్వహిస్తారు.


🌷ఇతర ప్రాంతాల్లో…🌷


🌿తమిళనాడులోని సుప్రసిద్ధ వైష్ణవక్షేత్రం శ్రీరంగం. అక్కడున్న రంగనాథ స్వామి ఆలయంలో ధన్వంతరి ఉపాలయం ఉంది. ఏ గుడిలో అయినా తీర్థంగా అభిషేక జలం ఇస్తారు. మహా అయితే, పంచామృతం పోస్తారు.


🌸ఇక్కడ మాత్రం వనమూలికలతో కూడిన కషాయాన్ని ఇస్తారు. ఆ తీర్థాన్ని తీసుకుంటే మొండివ్యాధులు సైతం మటుమాయమైపోతాయని ఓ నమ్మకం. కంచి వరదరాజ పెరుమాళ్ ఆలయ ఆవరణలోనూ ఆ ఆరోగ్యదేవుడి విగ్రహం ఉంది.


🌿కేరళలోని గురువాయూర్ సమీపంలో కూడా ధన్వంతరి ఆలయాన్ని నిర్మించారు. కొత్తగా ఆయుర్వేద వైద్యవృత్తిని చేపట్టేవారు ముందుగా స్వామిని దర్శించుకుని పూజాదికాలు నిర్వహించడం ఇక్కడి సంప్రదాయం.

🌸కాలికట్ దగ్గర్లోనూ ఓ ధన్వంతరి క్షేత్రం ఉంది. వేపనూ, పసుపునూ మానవాళికి పరిచయం చేసిన ఘనత కూడా ధన్వంతరిదేనంటారు. శస్త్రచికిత్స విధానాన్ని శుశ్రుతాదులకు బోధించిన ఆదివైద్య గురువూ ఆయనేనంటారు..


🌹ఓం నమామి ధన్వంతరమాది దేవమ్!...


🙏 శ్రీ ధన్వంతరీ అష్టోత్తర శతనామావళి...!!


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


🌹శ్రీధన్వంతరీ అష్టోత్తర శతనామావళి


ఓం నమో భగవతే వాసుదేవాయ నమః

ఓం ధన్వంతరయే అమృత కలశ హస్తాయ నమః

ఓం సర్వామాయ నాశనాయ నమః

ఓం త్రిలోక్యనాధాయ నమః

ఓం శ్రీ మహా విష్ణవే నమః

ఓం ధన్వంతరయే నమః

ఓం ఆదిదేవాయ నమః

ఓం సురాసురవందితాయ నమః

ఓం వయస్తూపకాయ నమః


ఓం సర్వామయధ్వంశ నాయ నమః 

ఓం భయాపహాయై నమః

ఓం మృత్యుంజయాయ నమః

ఓం వివిధౌధధాత్రే నమః

ఓం సర్వేశ్వరాయ నమః

ఓం శంఖచక్ర ధరాయ నమః

ఓం అమృత కలశ హస్తాయ నమః

ఓం శల్య తంత్ర విశారదాయ నమః

ఓం దివ్యౌషధధరాయ   నమః

ఓం కరుణామృతసాగారాయ నమః


ఓం సుఖ కారాయ నమః

ఓం శస్త్రక్రియా కుశలాయ  నమః

ఓం దీరాయ నమః

ఓం త్రీహాయ నమః

ఓం శుభ దాయ నమః

ఓం మహా దయాళవే నమః

ఓం సాంగాగతవేదవేద్యాయ నమః

ఓం భిషక్తమాయ నమః

ఓం ప్రాణదాయ నమః

ఓం ఆర్తత్రాణపరాయణాయ నమః


ఓం ఆయుర్వేదప్రచారాయ నమః

ఓం అష్టాంగయోగనిపుణాయ నమః

ఓం జగదుద్ధారకాయ నమః

ఓం హనూత్తమాయ నమః

ఓం సర్వజ్ఞాయై నమః

ఓం విష్ణవే నమః

ఓం సమానాధి వర్జితాయ నమః

ఓం సర్వప్రాణీసుకృతే నమః

ఓం సర్వ మంగళకారాయ నమః

ఓం సర్వార్ధదాత్రేయ నమః


ఓం మహామేధావినే నమః

ఓం అమృతతాయ నమః

ఓం సత్యాసంధాయ నమః

ఓం ఆశ్రిత జనవత్సలాయ నమః

ఓం అమృత వపుషే నమః

ఓం పురాణ నిలయాయ నమః

ఓం పుండరీకాక్షాయ నమః

ఓం ప్రాణ జీవనాయ నమః

ఓం జన్మమృత్యుజరాధికాయ నమః

ఓం సాధ్గతిప్రదాయి నమః


ఓం మహాత్సాహాయై నమః

ఓం సమస్త భక్త సుఖ ధాత్రేయ నమః

ఓం సహిష్ణవే నమః

ఓం శుద్ధాయ నమః

ఓం సమాత్మనే నమః

ఓం వైద్య రత్నాయ నమః

ఓం అమృత్యవే నమః

ఓం మహాగురవే నమః

ఓం అమృతాంశోద్భవాయై నమః

ఓం క్షేమకృతే నమః

ఓం వంశవర్దరాయ నమః


ఓం వీత భయాయ నమః

ఓం ప్రాణప్రదే నమః

ఓం క్షీరాబ్ధిజన్మనే నమః

ఓం చంద్రసహోదరాయ నమః

ఓం సర్వలోక వందితాయ నమః

ఓం పరబ్రహ్మనే నమః

ఓం యజ్ఞబోగీధరేనయ నమః

ఓం పుణ్య శ్లోకాయ నమః

ఓం పూజ్య పాదాయ నమః

ఓం సనాతన తమాయ నమః


ఓం స్వస్థితాయే నమః

ఓం దీర్ఘాయుష్కారాకాయ నమః

ఓం పురాణ పురుషోత్తమాయ నమః

ఓం అమరప్రభవే నమః

ఓం అమృతాయ నమః

ఓం ఔషదాయ నమః

ఓం సర్వానుకూలాయ నమః

ఓం శోకనాశనాయ నమః

ఓం లోకబంధవే  నమః

ఓం నానారోగార్తిపంజనాయ నమః


ఓం ప్రజానాంజీవ హేతవే నమః

ఓం ప్రజారక్షణ దీక్షితాయ నమః

ఓం శుక్ల వాసనే నమః

ఓం పురుషార్ధ ప్రదాయ నమః

ఓం ప్రశాంతాత్మనే నమః

ఓం భక్త సర్వార్ధ ప్రదాత్రేనయ నమః

ఓం మహైశ్వర్యాయ నమః

ఓం రోగాశల్యహృదయే నమః

ఓం చతుర్భుజాయ నమః

ఓం నవరత్నభుజాయ నమః


ఓం నిస్సీమమహిమ్నే నమః

ఓం గోవిందానాంపతయే నమః

ఓం తిలోదాసాయ నమః

ఓం ప్రాణాచార్యాయ నమః

ఓం బీష్మణయే నమః

ఓం త్రైలోక్యనాధాయ నమః

ఓం భక్తిగమ్యాయ నమః

ఓం తేజోనిధయే నమః

ఓం కాలకాలాయ నమః

ఓం పరమార్ధ గురవే నమః


ఓం జగదానందకారకాయ నమః

ఓం ఆది వైద్యాయ నమః

ఓం శ్రీరంగనిలయాయ నమః

ఓం సర్వజన సేవితాయ నమః

ఓం లక్ష్మీ పతయే నమః

ఓం సర్వలోక రక్షకాయ నమః

ఓం కావేరిస్నాత సంతుష్టయ నమః

ఓం సర్వాభీష్టప్రదాయవిభూషితాయే నమః


ఇతి శ్రీ ధన్వంతరీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం..


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

మంచి సమాచారం ఇచ్చారు. అష్టోత్తర శతనామావళిలో అక్షర దోషాలు ఉన్నాయి.